హైదరాబాద్

కరడుగట్టిన దొంగపై పీడీ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: పలు దొంగతనాలు, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న కరడుగట్టిన దొంగపై రాచకొండ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. సుమారు 18 ఆస్తి సంబంధిత నేరాలతో సంబంధం ఉన్న షేక్ జంషీద్ అలియాస్ జమ్మి ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డంలో దిట్ట. చాలాసార్లు నేరాలకు పాల్పడి జైలుకెళ్లి తిరిగి వచ్చి మళ్లీ మళ్లీ అదే నేరాలు చేస్తున్నాడు. ఏడు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేయడమే కాకుండా ఎనిమిది సాధారణ నేరాలను కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చేశారు. అనేక రకాల చట్టవిరుద్ద కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నాడు. జంషీద్ వాస్తవానికి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వాడు. 2000 సంవత్సరంలో బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి జల్సాలకు అలవాటుపడి డబ్బు సులభంగా సంపాదించడం కోసం నేరాలు చేయడం ప్రారంభించాడు. నారాయణగూడ, పంజాగుట్ట పోలీసులు ఇదివరకు నిందితుడిని దొంగతనం కేసుల్లో అరెస్టు చేశారు. కుషాయిగూడ పోలీసులు గత నెల 5వ తేదీన బంగారం దొంగిలించిన కేసులో నిందితుడి వేలిముద్రల ఆధారంగా అరెస్టు చేశారు. 34 తులాల బంగారు నగలు, 10 తులాల వెండి, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరస్తుడి చరిత్రను పరిశీలించి రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ నిందితుడిపై పిడి చట్టం ప్రయోగించి ఈ నెల 20న చర్లపల్లి జైలుకు పంపించారు.

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి
* ఏసీపీ కృష్ణమూర్తి
కుషాయిగూడ, మార్చి 21: సర్వమతాలను గౌరవిస్తూ ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని అల్వాల్ ఏసీపీ కృష్ణమూర్తి సూచించారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో శ్రీరామనవమిని పురస్కరించుకుని శాంతి కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఏసీపీ కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీరామ నవమి శోభాయాత్రను కుషాయిగూడ హనుమాన్ దేవాలయం మీదుగా ఈసీఐఎల్ చౌరస్తా వరకు శాంతియుతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెంట్ కుషాయిగూడ సీఐలు చంద్రశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, ఏస్సైలు శ్రీనివాస్, రవి, శ్రీశైలం నాయక్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

కుటుంబానికి అండగా..
జీడిమెట్ల, మార్చి 21: మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తుంది మహిళా ఆటో డ్రైవర్ నారాయణమ్మ. తన కాళ్ల పై తాను నిలబడడమే కాకుండా కుటుంబానికి అండగా పిల్లలు ఉన్నత చదువులను చదివిస్తూ మహిళా లోకానికే ఆదర్శంగా నారాయణమ్మ ముందుకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, సింహాద్రి పురం మండలం, బొజ్జాయి పల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మ, చెన్నారెడ్డి దంపతులు. వీరికి కుమార్తె వౌనికారెడ్డి, కొడుకు మనీష్‌రెడ్డిలు సంతానం. 1992 సంవత్సరంలో నారాయణమ్మ కుటుంబం బ్రతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి గ్రామం, రాజీవ్ గాంధీనగర్‌లో నివాసముంటున్నారు. చెన్నారెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ వైరింగ్ పనులు చేస్తుంటాడు. నారాయణమ్మకు ఎవరి దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదు. దీంతో ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. 12 సంవత్సరాలుగా ఆటోను నడుపుకుంటూ నారాయణమ్మ కుటుంబానికి అండగా నిలుస్తోంది. అంతేకాకుండా కూతురు వౌనికారెడ్డిని డాక్టర్‌ను చేయాలన్న సంకల్పంతో ఎం-్ఫర్మసీ చదివిస్తోంది. జనరల్ కేటగిరి కావడంతో వౌనికారెడ్డికి ఎంబీబీఎస్ సీట్ రాలేదు. కొడుకు మనీష్‌రెడ్డి ప్రస్తుతం బీ-టెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. 12 సంవత్సరాలుగా నారాయణమ్మ ఆటోను నడుపుకుంటూ పిల్లలకు ఉన్నత చదువులకు తీసుకువెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నారాయణమ్మ నిరూపిస్తుంది. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వశక్తితో ముందుకు వెళ్లాలని మహిళలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తోంది.
కుట్టుమిషన్‌లు, ప్రైవేటు పరిశ్రమలలో ఉద్యోగాలు, కూలీ పనులే కాకుండా డ్రైవింగ్ సైతం చేయవచ్చని నిరూపించింది. హైదరాబాద్ నగరం చుట్టూ ఎక్కడికి వెళ్లాలన్నా నారాయణమ్మ ఆటో సిద్ధంగా ఉంటుంది.