హైదరాబాద్

70 అంగన్‌వాడీలకు కొత్త భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: బడి ఈడు పిల్లలను విద్యాభ్యాసం వైపు ఆకర్షితం చేసేందుకు ఒకరంగా వారికి ప్లే స్కూల్‌గా సేవలందించటం.. గర్భిణులు, మహిళలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు కమ్యూనిటీ హాళ్లు, జీహెచ్‌ఎంసీ భవనాలు, కాలనీ సంక్షేమ సంఘాల ఆఫీసుల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీల్లో 70 కేంద్రాలకు తొలి దశగా భవనాలను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రూ. కోటి 75లక్షలతో ప్రారంభించిన ఈ పనులన్నీ జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఇంజనీర్లను కలెక్టర్ డా.యోగితారాణా ఆదేశించారు. గురువారం కలెక్టర్ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ భవనాలు పూర్తయిన తర్వాత రెండో దశగా మరో 20 భవనాలు నిర్మించేందుకు స్థలాలను కేటాయించాలని ఇన్‌చార్జి జేసీ శ్రీవత్సకోటను సూచించారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో రూ. 2 కోట్ల 20లక్షలతో చేపట్టే ఆధునికీకరణ పనులు నాలుగైదు రోజుల్లో ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ తెలిపారు. సెంట్రల్ లైబ్రరీలో అదనపు వసతికి రూ.మూడు కోట్లతో నిర్మించనున్న నూతన భవనం డిజైన్లను ప్రభుత్వం ఆమోదానికి పంపనున్నట్టు చెప్పారు. జిల్లా పరిధిలో మరో 32 గ్రంథాలయాల భవనాలు, ఫర్నిచర్, మరమ్మతులు, పుస్తకాల కొనుగోలు, సరికొత్త ఫర్నిచర్‌కు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉమాదేవిని ఆదేశించారు. ఈఈ సాంబయ్య పాల్గొన్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కన్సల్టెంట్లు
హైదరాబాద్, మార్చి 22: మహానగరంలో భారీ వర్షాలు కురిసినా, ఏదైనా వైపరీత్యాలు సంభవించినపుడు ప్రధాన కార్యాలయం నుంచి నేరుగా పరిస్థితిని సమీక్షిస్తూ ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ప్రారంభిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు 49 మంది ఐటీ కన్సల్టెంట్లను నియమించే ప్రతిపాదనకు స్థారుూ సంఘం గురువారం పచ్చజెండా ఊపింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరో పది ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. సీజీజీ ద్వారా గతంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన 350 మంది సైటు ఇంజనీర్లకు వేతనాల చెల్లింపునకు కూడా స్థారుూ సంఘం సానుకూలంగా తీర్మానం చేసింది. ఎస్టేట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు రిటైర్డు తహశీల్దార్ల సేవలను మరో ఆరు నెలలు వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన 60 ఏళ్లకు పై బడిన ఔట్‌సోర్సింగ్ శానిటరీ వర్కర్లు, 60 ఏళ్లలోపు వయస్సు కలిగి మెడికల్‌గా ఫిట్ లేని వారి స్థానంలో అర్హులైన వారి వారసులు, కుటుంబ సభ్యులను నియమించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా స్థారుూ సంఘం ఆమోదించింది. సర్వర్‌నగర్ నుంచి గంగాబౌలి మార్గంలో నాలా పై రూ.4.30 కోట్ల వ్యయంతో ఆర్‌సీసీ డ్రెయిన్ బాక్స్ నిర్మాణ ప్రతిపాదనలు, నెహ్రూ సఫారీ పార్కు నుంచి కిషన్‌బాగ్ వరకు ఆర్‌సీసీ రిటైనింగ్ వాల్‌ను రూ. 4.40 కోట్లతో నిర్మించేందుకు ఆమోదించింది. కిషన్‌బాగ్ రహదారి నుంచి మజీద్ కిరాణ స్టోర్ మీదుగా మూసీ నది వరకు రూ. 7.70 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా సానుకూలంగా తీర్మానం చేసింది. ఖైరతాబాద్ సర్కిల్‌లోని బల్కాపూర్ నాలాపై 200 మీటర్ల పొడువున రిటైరింగ్ వాల్ నిర్మాణం, 75 మీటర్ల మేరకు చైన్‌లింక్ మెష్ ఏర్పాటు కోసం రూ. 2.38 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర వేసింది. జీహెచ్‌ఎంసీలో ఎల్‌ఈడీ ప్రాజెక్టు చేపట్టినందున విద్యుత్ విభాగంలో మిగిలిన 381 మంది ఔట్‌సోర్సు సిబ్బందిని జీహెచ్‌ఎంసీ లేక్స్, పార్కులు, ఎంటమాలజీ, అడ్వర్‌టైజ్‌మెంట్, స్పోర్ట్స్ విభాగాల్లో నియమించాలన్న ప్రతిపాదనను కూడా ఆమోదించింది. కొండాపూర్‌లోని డీఆర్‌ఎఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీకి 242 చదరపు అడుగుల భూమిని ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే షరతులతో కేటాయించేందుకు అంగీకరించింది. శేరిలింగంపల్లి మదీనాగూడలోని సాయినగర్‌కాలనీ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ మీదుగా ఆదర్శ్‌నగర్‌కు వెళ్లే లింకురోడ్డును 30 అడుగులకు విస్తరించాలన్న ప్రతిపాదనను కూడా స్థారుూ సంఘం ఆమోదించినట్టు అధికారులు తెలిపారు.

25 నుంచి శ్రీసత్యసాయ సర్వీస్ వింగ్ గోల్డెన్ జూబ్లీ
హైదరాబాద్, మార్చి 22: అనంతపురం జిల్లా పుట్టపర్తి కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ సత్యసాయ సేవా ఆర్గనైజేషన్ (ఎస్‌ఎస్‌ఎస్‌వో) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖల శ్రీసత్యసాయ సర్వీస్‌వింగ్ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాలను మార్చి 25 నుం చి వచ్చే నెల 4వరకు జరగనున్నాయ. సర్వీస్‌వింగ్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరికొన్ని ఉపయుక్త కార్యక్రమాలను ఎస్‌ఎస్‌ఎస్‌వో నిర్వహించనుంది.ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని 23 చోట్ల తాగునీటి క్యాంపులు, పేదలకు పాదరక్షల పంపిణీ , పేదలకు ఉచితంగా ఆహారం పంపిణీ ఉంటుంది. హైదరాబాద్ రూరల్ ప్రాంతాల్లో రిమోట్ వోకేషనల్ శిక్షణ స్కీం కిట్ల పంపిణీ, మహిళలకు గాజుల తయారీ, టైలరింగ్, మెహందీ రంగాల్లో శిక్షణ చేపట్టనున్నారు. కార్యక్రమాలు జంట నగరాల్లోని వివిధ ప్రదేశాల్లో జరుగుతాయ. ఉత్సవాల ముగింపు వచ్చేనెల 4న శివం టెంపుల్‌లో నిర్వహిస్తారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్‌ఎస్‌ఎస్‌వో జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండ్య హాజరుకానున్నారు. 25న బాగ్ అంబర్‌పేట్‌లోని శ్రీసత్యసాయ విహార్ ఉన్నత పాఠశాలలో నిమీష్‌పాండ్య, రిటైర్డ్ డీజీపీ హెచ్‌జే దొర (ఏపీ,టీఎస్ కన్వీనర్) ప్రారంభిస్తారు.