హైదరాబాద్

త్వరలో నగరమంతా నిఘా కళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభా,రద్దీతో పాటు ప్రజాభద్రత నిమిత్తం నిఘా మరింత ముమ్మరం కానుంది. ఇప్పటికే కమ్యూనిటీ సిసి కెమెరాలు, ప్రైవేటు వ్యాపార సంస్థల నిఘా కళ్లు ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తుండగా, దీనికి తోడు ము న్ముం దు మరో 60వేల సిసి కెమెరాలు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. ప్రజాభద్రత నిమిత్తం నగరంలో 50వేల సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలంటూ రెండేళ్ల క్రితం జిహెచ్‌ఎంసి, నగర పోలీసు శాఖ పంపిన ప్రతిపాదనల మేరకు రానున్న ఆర్థిక సంవత్సరం (2016-17) బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 225 కోట్లు కేటాయించటంతో ఈ ప్రతిపాదన మరో అడుగు ముందుకు పడింది. ఇంతకు ముందు ప్రతిపాదనైతే బాగుంది కాని ఇందుకు నిధులుఏ శాఖ నుంచి కేటాయించాలన్న విషయంపై నెలకొన్న అయోమయం దీంతో తొలగిపోయింది. ప్రభుత్వం త్వరలోనే ఐటి శాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 50వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలంటే సుమారు రూ. 400 నుంచి రూ. 450 కోట్ల వ్యయంతో కూడుకున్న పనిగా అప్పట్లోనే నిర్థారించారు. ఈ ప్రతిపాదన రూపకల్పన చేసి రెండేళ్లు గడవటంతో ప్రస్తుతం సర్కారు కేటాయించిన నిధుల కన్నా ఎక్కువగానే ఖర్చయ్యే అవకాశాలున్నాయి. ప్రతిపాదనలో తొలి విడతగా వెయ్యి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో జిహెచ్‌ఎంసి, నగర పోలీసు శాఖలు సమష్టిగా ప్రకటన చేసినా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నగరవ్యాప్తంగా ఒకే సారి సిసి కెమెరాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న పలు సంఘటనల దర్యాప్తునకు ఈ సిసి కెమెరాల ఫుటేజీలు ఎంతో దోహదపడటం, అలాగే పలు ఘటనలకు సంబంధించి వీటి ఆధారంగా కేవలం గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవటం వంటివి జరగటంతో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలో భాగంగా నగరంలోని అణువణువు సిసి కళ్లు అవసరమని, ప్రభుత్వం భావిస్తోంది.
మున్ముందు నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిసి కెమెరాలతో కేవలం శాంతిభద్రతలే గాక వివిధ రకాల సేవలకు వినియోగించాలని సంకల్పంతో సర్కారు ఉంది. కేవలం నేరాలు జరిగినపుడు నిందితులను గుర్తించటమే గాక, ఒక కెమెరాను ఏర్పాటు చేస్తే దాని పరిధిలోని రోడ్లు, వీది ధీపాల మరమ్మతులు, అలాగే వాటర్ పైప్‌లైన్ల మరమ్మతులు ఇతరాత్ర పౌరసేవలకు సంబంధించిన ఫుటేజీని కూడా ఎప్పటికపుడు గమనిస్తూ త్వరితగతిన మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా సంబంధిత శాఖను అప్రమత్తం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని విషయాలకు సంబంధించి ఫుటేజీని కోరే ప్రైవేటు సంస్థలకు ఛార్జీలను వర్తింపజేసి, ఫుటేజీని ఇచ్చే అంశం కూడా సర్కారు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.