హైదరాబాద్

14వేల మెగావాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14వేల మెగావాట్లకు చేరుకుందని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు 7600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండేదన్నారు. గురువారం ఇక్కడ సచివాలయంలో మేజర్ జనరల్ హర్ కిరత్ సింగ్ నేతృత్వంలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ సభ్యులు ఎకనామిక్ సెక్యూరిటీ టూర్‌లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌కె జోషి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతరాయం ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా పునరావాస ప్యాకేజీని అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భారీ, మధ్య తరహా ఇరిగేషన్‌లతో పాటు మైక్రో ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ నగర భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. మంచి రోడ్లు, భద్రత, మంచినీరు, నిరంతర విద్యుత్ సదుపాయాలు మెరుగైన జీవనానికి అనువైన నగరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరిత హారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమల రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 45వేల చెరువుల మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు.