హైదరాబాద్

సమ సమాజమే భగత్ సింగ్ ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మార్చి 23: భగత్‌సింగ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరి శంకర్ అన్నారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వర్ధంతి సభ శ్రీత్యాగరాయ గానసభ, శారదలక్ష్మీ సామాజిక సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జూలూరి భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భగత్‌సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, త్రినాథరావు పాల్గొన్నారు. సభకు ముందు గాయనీ సుజాత మూర్తి నిర్వహణలో నిర్వహించిన భక్తి గీతాలు అలరించాయి.
వికారాబాద్: భగత్‌సింగ్ కోరుకున్నది సమసమాజమని నాయకులు కొనియాడారు. శుక్రవారం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్థంతిని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ అధ్యక్షత వహించగా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పీ.యాదగిరి, కార్యదర్శి రామకృష్ణ, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం, ఎం.రత్నం, నర్సింలు, శ్రీనివాస్, జంగయ్య, మాణిక్యం, గణేష్, నరేష్ పాల్గొన్నారు.
ఉప్పల్: బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌కు భారతరత్నను వెంటనే ప్రకటించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ మేడిపల్లి మండలం కమిటీ ఆధ్వర్యంలో 87వ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉప్పల్ బస్‌డిపో వద్ద భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏఐఎస్‌ఎఫ్ నేతలు వెంకట్, నరేష్, అన్వర్, శశిధర్, నవీన్, వినయ్, సందీప్, శ్రీహరి, కిషోర్, రమేశ్ పాల్గొన్నారు.
కొత్తూరు: భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు. శుక్రవారం భగత్‌సింగ్ 87వ వర్ధంతి సభను కొత్తూరు సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి షకీల్, కొంగరి నర్సింహ, ఎల్లయ్య, రాములు, మైసయ్య పాల్గొన్నారు.
షాద్‌నగర్: షాద్‌నగర్ ముఖ్యకూడలిలో భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నేత ఈశ్వర్ నాయక్ పాల్గొన్నారు.