హైదరాబాద్

మహిళా కండక్టర్లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ ఆర్టీసీలోని ఉద్యోగులలో మానవ సంబంధాలు పెంపొందించి వారిలో నైపుణ్యాన్ని బయటకు తీసి సంస్థను అభివృద్ధి పథంలో నిలిపే దిశగా ట్రాన్స్‌పోర్టు అకాడమి పని చేయడం అభినందనీయమని సంస్థ జాయింట్ డైరక్టర్ (విజిలెన్స్, సెక్యూరిటీ) టి.వెంకటరావు అన్నారు. శుక్రవారం హకీంపేటలోని అకాడమి, జోనల్ స్ట్ఫా ట్రైనింగ్ కాలేజీలో వివిధ కేటగిరి ఉద్యోగులకు నిర్వహించిన ‘నాయకత్వ అభివృద్ధి’ శిక్షణ తరగతులను సందర్శించారు. సంస్థను ఏవిధంగా పరిరక్షించుకోవాలి, డిపోల్లో విధులు ఎలా నిర్వహించుకోవాలి, ఆర్టీసి ఆస్తులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై వివరాలను వెల్లడించారు. మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ కూడా అందించగా, ట్రాఫిక్ సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులను నిర్వహించారు. జోనల్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఆర్టీసీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి కిరణ్‌రెడ్డి శిక్షణ తరగతులను పర్యవేక్షించారు. మహిళలకు కరాటే శిక్షణను ప్రవీణ్‌కుమార్ అనే కరాటే కోచ్ ద్వారా అందించారు.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలి : హరగోపాల్
ఖైరతాబాద్, మార్చి 23: ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 24 గంటలు కరెంటు కోసం పరితపించే తెలంగాణ విద్యుత్ ఒప్పంద కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గతంలో విద్యుత్ ఒప్పంద కార్మికులను సీఎం కేసీఆర్ పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారని, కాని అది ప్రకటనకే పరిమితమైందని, కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 24 వేల మంది ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఆర్టిజన్ కార్మికుల విలీన ప్రక్రియ పూర్తి అయ్యేవరకు జే ఎల్ ఎం నోటిఫికేషన్ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుడు ఏవిధంగా చనిపోయినా 10 లక్షలు ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని, మొత్తం 16 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తాను అండగా ఉంటానన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్రీ్ధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిరాం, ఉపేందర్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.