హైదరాబాద్

ఎంఎంటీఎస్ రెండో దశ ట్రయల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండో దశ ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో మల్కాజ్‌గిరి నుంచి బొల్లారం మధ్య 10 కిలోమీటర్ల స్ట్రెచ్ నిర్మాణం పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన ఈ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇటీవలే విద్యుదీకరణ పనులు పూర్తవడం, దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్ క్రిపాల్ తనిఖీ కూడా పూర్తి చేశారు. మార్చి మొదటి వారంలో ఎంఎంటీఎస్ సర్వీస్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అధికారికంగా సేఫ్టీ కమిషనర్ ధృవీకరణ వస్తే రైళ్లు నడిపేందుకు మార్గం సుమగం అవుతుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లకు తోడు మరికొన్ని కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఉన్న వాటికి కొన్నింటి ఎత్తు, పొడవు పెంచుతున్నారు. రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) విద్యుదీకరణ పనులు చేపట్టింది. 10 కిలోమీటర్ల దూరంలో 11 స్టేషన్లు ఉంటాయి. కాగా ఎంఎంటీఎస్ రెండో దశ కింద మొత్తం ఆరు స్ట్రెచ్‌ల్లో 96 కిలోమీట ర్ల దూరం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకే కాకుండా నగర శివారులోని ప్రజానీకానికి రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. సికింద్రాబాద్- వౌలాలి- ఘట్‌కేసర్, సికింద్రాబాద్-బొల్లారం-మేడ్చల్, ఫలక్‌నుమా-ఉమ్దానగర్-ఎయిర్‌పోర్టు, వౌలాలి-సనత్‌నగర్, వౌలాలి-మల్కాజ్‌గిరి-సీతాఫల్‌మండి, తెల్లాపూర్-రామచంద్రాపురం కలిపి మొత్తం ఆరుస్ట్రెచ్‌లలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి. ఫిరోజ్‌గూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, నేరేడ్‌మెట్, వౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో కొత్త రైల్వే స్టేషన్లు రెండో దశ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. మల్కాజ్‌గిరి-బొల్లారం మధ్య ఎంఎంటీఎస్ త్వరలో ప్రారంభమైతే హైదరాబాద్, ఫలక్‌నుమా, లింగంపల్లి సర్వీసులకు లింక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 3.5 కి.మీ దూరం నిర్మాణం పూర్తయితే బాగుంటుందని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడుతుందని చెబుతున్నారు. రెండో దశలో మల్కాజ్‌గిరి-బొల్లారం 10 కి.మీ. దూరం త్వరలో ప్రారంభమైతే, మిగిలిన ఐదు స్ట్రెచ్‌లలో పనులు శరవేగంగా పూర్తి చేసి 2018 డిసెంబర్ నాటికి ప్రయాణికులకు పూర్తి సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.