ఆంధ్రప్రదేశ్‌

. గ్రామస్వరాజ్ అభియాన్‌ని గ్రామాల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: గ్రామస్వరాజ్ అభియాన్ కింద ఎన్నుకోబడిన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు 100 శాతం అమలు చేసి పూర్తిస్థాయిలో ప్రజలు లబ్ధిపొందేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీలు, జిల్లా కలెక్టర్‌లను కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో, జిల్లా కలెక్టర్‌లతో, గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంపై ఇతర సంబంధిత అధికారులతో కలిసి క్యాబినెట్ సెక్రెటరీ పీకే సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంఘీక సామరస్యాన్ని పెంపొందించడానికి వివిధ ప్రోత్సాహకాల గురించి అవగాహన కల్పించడంతో గ్రామీణాభివృద్ధిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా 14న అంబేద్కర్ జయంతి, 18న స్వచ్ఛ భారత్, 20న ఉజ్వల పంచాయత్, 24న పంచాయతీ రాజ్ దివాస్, 28న గ్రామ శక్తి అభియాన్, 30న ఆయుష్మాన్ భారత్ అభియాన్, మే 2న కిసాన్ కళ్యాన్ కార్యశాల, మే 5న కౌశల్ వికాస్ మేళ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి 21058 గ్రామాలను ఎన్నుకున్నామని చెప్పారు. ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ముఖ్య పథకాలైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ఉజాలా, జాన్‌ధన్ యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, మిషన్ ఇంద్ర ధనుష్ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి 100 శాతం వాటిని పూర్తిగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సబ్కా సాత్ సబ్కా గావ్ వికాస్ అనే నినాదంతో చేపట్టబోతున్న కార్యక్రమంలో గ్రామస్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు అధికారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో గోపులారం (శంకేర్పల్లి), నాగిరెడ్డిగూడ (మొయినాబాద్) మరియు ముఖ్నూర్ (ఇబ్రహీమ్‌పట్నం) గ్రామాలను ఈ పథకం కింద ఎన్నుకున్నామని, సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటుచేసి ఈ మూడు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పై ఏడు పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించుకుని లబ్ది పొందేలా చర్యలు చేపడతామని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ కలెక్టర్ ఒమర్ జలీల్, డీఆర్‌డీఓ ప్రశాంత్‌కుమార్, డీఎంహెచ్‌ఓ బాలాజీపవర్ పాల్గొన్నారు.

పీర్జాదిగూడలో దోమల బెడద..
ఉప్పల్, ఏప్రిల్ 10: పీర్జాదిగూడలో దోమల బెడదతో పాటు నీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. ఒకవైపు ఎండలు ముదురుతుండటంతో దోమలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. నిత్యం సాయంత్రం ఐదుగంటలకు దోమలు ఇళ్లలోకి ప్రవేశించి నోట్లోకి పోతూ.. చెవుల వద్ద గుయ్యిమంటూ.. విజృంభిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పురపాలక సంఘం పరిధిలోని పర్వతాపూర్, పీర్జాదిగూడ, మేడిపల్లిలోని అన్ని కాలనీల ప్రజలు దోమల బెడదతో బెంబేలెత్తుతున్నారు. అస్తవ్యవస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, ఏరులై పారుతున్న ఓపెన్ నాలాలో వృద్ధి చెందుతున్న దోమలు విజృంభిస్తూ కంటికి నిద్రలేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి యాంటీ లార్వా ఆపరేషన్ పనులు చేపట్టాలని, నిత్యం కాలనీల వారీగా ఫాగింగ్ చేయాలని కోరుతూ బీజేపీ పీర్జాదిగూడ కమిటీ అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాణి సుధాకర్, గీత, పవన్‌రెడ్డి, స్వరూప, అనురాధ,