హైదరాబాద్

ప్లానింగ్‌పై..విజిలెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అక్రమాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌పై కొత్తగా ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి నేతృత్వంలో చర్యలను మొదలు పెట్టిన విజిలెన్స్ విభాగానికి తొలి దశగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే బాధ్యతను అప్పగించింది. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని ఇప్పటి వరకు భావించిన జిహెచ్‌ఎంసీ అసలు అక్రమ నిర్మాణాలు ప్రారంభం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాలు మంజూరు చేసే నిర్మాణ అనుమతుల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగానికి ఎప్పటికపుడు సమర్పిస్తే, ఈ బృందాలు కూడా క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న తీరును నేరుగా పర్యవేక్షించే వీలు కల్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అనుమతులున్నా, దాన్ని ఉల్లంఘించే తీరును అప్పటికపుడే ఈ బృందాలు పసిగట్టి, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఈ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే యజమానులపైనే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించే అధికారులను కూడా విచారణలో భాగస్వాములను చేయాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
బృందాల్లో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులు కూడా ఉండటంతో ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలపై క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకునే సమయంలో ఎదురయ్యే శాంతిభద్రతల సమస్యలు ఇక ముందు ఎదురయ్యే పరిస్థితులు లేనందున అక్రమ నిర్మాణాలను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకునే తరహాలో బృందాలను ఏర్పాటు చేయనున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చా లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే, దాన్ని టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలించి అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించిన తర్వాత, ఫిర్యాదు తీవ్రతను బట్టి విజిలెన్స్‌కు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు.