హైదరాబాద్

నేడు దళిత భక్తునికి శ్రీరంగనాథుని దివ్య దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళితులకు ఆలయ ప్రవేశంలో ఇదొక కీలక సంఘటన. దళిత భక్తుడిని శ్రీ వైష్ణవ ఆలయ ప్రధాన అర్చకుడు ఏకంగా తన భుజస్కంధాలపై కూర్చోబెట్టుకుని ఆలయ ప్రవేశం చేయించి శ్రీరంగనాథుడి దివ్య దర్శనం కల్పించే కార్యక్రమం సోమవారం జరగబోతోంది. నగరంలోని జియాగూడలోని చారిత్రక శ్రీరంగనాథస్వామి దేవస్థానం ఈ అరుదైన ఘట్టానికి వేదిక కానున్నది.
తెలంగాణ దేవాలయ పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సి.ఎస్.రంగరాజన్ నేతృత్వంలో ఈనెల 16న సాయంత్రం 4 గంటలకు మునివాహన సేవ మహోత్సవ వేడుక చేపట్టారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌కు చెందిన దేవీ ఉపాసకులు, శ్రీవైష్ణవ ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్యపరశ్రీ దళిత భక్తుడికి ఆలయ ప్రవేశం చేయిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రంగరాజన్ వివరించారు.
క్రీ.పూ. 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగంలో ఆచరించిన ఇదే తరహా సంప్రదాయాన్ని జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో ఆచరించనున్నట్లు వివరించారు.
దళిత జాతి అభ్యున్నతికి రామానుజాచార్యులు వేయి సంవత్సరాల క్రితమే పోరాటం చేసారని, హిందువులంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటారన్నారు. సమాజంలో దళితులపై వివక్షను రూపుమాపి సమసమాజ స్థాపనే ధ్యేయంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.