హైదరాబాద్

దళిత వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: దళితులను మభ్యపెట్టి అధికారం చెలాయిస్తున్న రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు పేర్కొన్నారు. సికిందరాబాద్ హమాల్‌బస్తీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ సంఘ్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. గౌతమ బుద్ధుడికి, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, సావిత్రి బాయి పూలె చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రేటర్ బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు కృష్ణ పూజారి అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఫెల్ ప్రొఫెసర్. పీ. శ్రీనివాస్, న్యాయవాది పుట్ట పద్మారావు, బహుజన సమాజ్‌పార్టీ నాయకుడు లింగం, జర్నలిస్ట్ సంఘం నాయకుడు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. దళితులపై జరుగుతున్న దాడులపట్ల అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే చర్యల పట్ల దళితులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలు అక్షరాస్యతను పెంపొందించుకుని, అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో దళితులను మభ్యపెట్టి ఓట్లు సాధించుకుంటున్న నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నోట్లకు కొనాలని చూసే నేతలను దరి చేరనివ్వవద్దని తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని తాము కోరనప్పటికీ సీఎంను చేస్తానని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి దళితులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని నేతలు పేర్కొన్నారు. అంబేద్కర్, జ్యోతి రావు పూలే, జగ్గీవన్ రామ్‌కు నివాళులు అర్పించడానికి కూడ సీఎం సమయం లేకుండా పోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండడంతోపాటు దళితులు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కార్మికుల పనిగంటలు 14 గంటల నుంచి ఎనిమిది గంటలకు తగ్గించి శ్రమ దోపిడికి అడ్డుకట్ట వేశారని గుర్తుచేశారు. సభ ప్రారంభానికి ముందు దళితులపై జరిగిన దాడుల్లో చనిపోయిన వారికి నెండు నిముషాలు వౌనం పాటించి నివాళులు అలర్పించారు.
శివారు కాలనీల అభివృద్ధికి కృషి
* కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి
నవస్థలిపురం, ఏప్రిల్ 16: డివిజన్ పరిధిలోని శివారు కాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసినట్లు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి చెప్పారు. డివిజన్ పరిధిలోని జడ్జీస్ కాలనీలో రూ.27 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కాలనీ సంక్షేమ సంఘం నాయకులతో కలసి ప్రారంభించారు. విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రధాన సమస్యలను యుద్ధప్రాతిప్రతికగా పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు. కాలనీలో పాదయాత్ర చేపట్టి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ టంగుటూరి నాగరాజు, డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చిక్కమెట్టు శ్రీకాంత్ రెడ్డి, వార్డు కమిటీ వల్లపు అరుణ్ కుమార్ యాదవ్, బాల్ రాజ్, పారంద నర్సింహా, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, దామోదర్ గౌడ్, కరుణాకర్ గౌడ్ పాల్గొన్నారు