హైదరాబాద్

మార్గదర్శకుడు .. బసవేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 18: ప్రపంచానికి మార్గదర్శకుడు మహాత్మా బసేశ్వరుడని పలువురు కొనియాడారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బసవేశ్వర కూడలిలోని విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యుడు బీ.సంజీవ రావు మాట్లాడుతూ వీరశైవ సమాజానికి సంబంధించిన స్థల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలంపల్లి కెంపిన మఠం స్వామి, కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, వీరశైవ సమాజం అధ్యక్షుడు ఆర్‌ఎం ఆనందం, మున్సిపల్ చైర్మన్ వీ.సత్యనారాయణ, ఆర్డీవో విశ్వనాథం, కౌన్సిలర్లు ఏ.సుధాకర్ రెడ్డి, మధుకర్, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎన్.బస్వరాజ్, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు ఎన్.శుభప్రద్ పటేల్, సమాజం నాయకులు పీ.సంగమేశ్వర్ రావు, వీరన్న, గిరీష్ కొఠారి, నాయకుడు ఎస్.రాజలింగం పాల్గొన్నారు. బసవేశ్వరుడి విగ్రహానికి మాజీ మంత్రులు డాక్టర్ ఏ.చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేశారు.
జీడిమెట్ల: సమసమాజ స్థాపనకు బసవేశ్వర మహరాజు ఆనాడే అంకురార్పణ చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. బుధవారం జగద్గిరిగు ట్టపై శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న బసవేశ్వర విగ్రహం వద్ద బసవ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా వీరశైవ లింగాయత్ సమాజము సభ్యులు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీతో పురవీధులలో తిరుగుతూ బసవేశ్వర విగ్రహం వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వేర్వేరుగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ మాట్లాడుతూ సమాజంలోని నిరుపేద వర్గాలు లింగభేదం లేకుండా ప్రతిఒకరికీ సమానమైన హ క్కులు కల్పించే విధంగా బసవేశ్వర మహరాజు కార్యక్రమాలు చేశారని చెప్పారు. బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు జగన్, రావుల శేషగిరి, నాయకులు సయ్యద్ రషీద్, అంజిరెడ్డి, మారయ్య, పాపులు గౌడ్, తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీ. హనుమంతు, ఫెడరేషన్ యూత్ అధ్యక్షుడు ఈశ్వర ప్రసాద్, జగద్గిరిగుట్ట వీరశైవ లింగాయత్ సమాజమ కార్యవర్గ సభ్యు లు, మహిళలు పాల్గొన్నారు. చింతల్ డివిజన్ గాజులరామారం రోడ్డు, ఎన్‌ఎల్‌బీ నగర్‌లో బసవేశ్వర మహరాజు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వేర్వేరుగా జ్యోతిప్రజ్వలన చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో రఫీ, ప్రకాశ్, రవిశంకర్, వీరేశం, శివరాజ్, శంకరప్ప, సత్యనారాయణ, బస్వరాజ్, రామప్ప, అంజిరెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.
షాద్‌నగర్: శ్రీ బసవేశ్వరుని జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్టణంలోని 18వ వార్డులో వీరశైవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుని జయంతి వేడుకలకు షాద్‌నగర్ ఎమ్మె ల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడు చేసిన పలు సేవలను గుర్తు చేశారు. వీరశైవులు.. బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, ఆకుల వీరేశం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబల్ నాయక్, నరేందర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, దొంతుల సురేష్, కౌన్సిలరు యుగందర్, చింటు, టీఆర్‌ఎస్ నేత దామోదర్ యాదవ్, బండ్లకాడి శ్రీను, సుధాకర్ పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని మల్లిఖార్జున కాలనీలో బసవేశ్వరుడి విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేశారు. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్దన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు ఆదర్శప్రాయుడని, కొనియా డారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, అసెంబ్లీ కన్వీనర్ హన్మంతు, పాండురంగా రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
కొందుర్గు: భక్తిశ్రద్ధలతో బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహించారు. బుధవారం జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం అవరణలో శ్రీ బసవేశ్వరుడి 885వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహంచారు. కార్యక్రమంలో జిల్లేడు చౌదరిగూప తహశీల్దార్ బాలరాజు, ఎ.వజ్ర లింగం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోనేరు నర్సింగ్ రావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది శ్రీశైలం, శర్వలింగం, బాల్‌లింగం, మార్కెట్ డైరెక్టర్ జబ్బార్ పాల్గొన్నారు.
కొడంగల్: బసవ జయంతి వేడుకలు కొడంగల్ బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం బసవ జయంతిని అధికారికంగా ప్రకటించడంతో తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వెంకటేష్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి నిర్వహించారు. 18కెడిఎల్ 1; బసవ జయంతి వేడుకలను నిర్వహిస్తున్న అధికారులు.
మర్పల్లి: మర్పల్లిలో బసవేశ్వర జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మండల వీరశైల లింగాయత్ సమాజ్ సంఘం అధ్యక్షుడు ఘనపురం వీరశెట్టి, సర్పంచ్ పాండు నాయక్, ఎంపీటీసీలు శేఖర్, ఫస్సీ, తహశీల్దార్ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐ విఠల్ రెడ్డి పాల్గొన్నారు.
తాండూరు: వీరశైవ సమాజం ఆరాధ్య దైవంగా కొలువ బడే బసవేశ్వరుడి 885 వ జయంతి వేడుకలను బుధవారం తాండూరులో నిర్వహించారు. లోక కల్యాణానికి తన వంతు కృషి చేసిన బసవేశ్వరుడు సర్వ మతాల సారాంశాన్ని లోకానికి చాటిన మహోన్నతమైన వ్యక్తి అని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాయలయంలో మీటింగ్ హాల్ నందు మున్సిపల్ కమిషనర్ పీ.్భగేశ్వర్లు కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేశారు.
వికారాబాద్: బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని బుధవారం శ్రీ మల్లికార్జున భవనం నుంచి వీరశైవ సమాజం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రహదారుల్లో బసవేశ్వరుని ఊరేగింపు సాగింది.
మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని బీజేపీ లీగల్ సెల్ జిల్లా కన్వినర్ ఆర్.సాయికృష్ణ కొనియాడారు. బుధవారం బసవేశ్వర జయంతిలో పాల్గొని మాట్లాడుతూ 1311లో కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరుడు స్ర్తి విద్య, కులతత్వ నిర్మూలన, అంత్య కులస్తుల ఆత్మవికాసం కోసం పనిచేశారని చెప్పారు.