హైదరాబాద్

మోడల్ వెండింగ్ జోన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: మహానగరంలో సీసీ, బీటీ రోడ్లన్నీ కలిపితే సుమారు తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటాయి. కానీ ఫుట్‌పాత్‌లు కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే. అందులో ఎక్కువ శాతం ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, సులభ్ కాంప్లెక్సులు, ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిస్తున్నాయి. ఫుట్‌పాత్‌లపై శాశ్వత ప్రాతిపదికన ఆక్రమణలను చెక్ పెట్టడంతోపాటు ప్రజలకు మార్కెటింగ్, కార్పొరేషన్‌కు ఆదాయాన్ని పెంపొందించేందుకు మోడల్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. నెలాఖరులోపు ప్రతి జోన్‌లో కనీసం రెండింటిని ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఫలితాలను బట్టి ప్రతి వార్డులో రెండింటిని ఏర్పాటు చేయాలని పాలక మండలి భావిస్తోంది. ప్రస్తుతం జోన్‌కు రెండు ప్రాంతాలను, ఆ తర్వాత ఒక్కో వార్డులో అనువైన, ప్రజలకు అందుబాటులో ఉండే స్థలాలను గుర్తించాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లను గుర్తించాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు మేయర్ వివరించారు. ఆక్రమణల తొలగింపు, ఫుట్‌పాత్‌ల రక్షణకు జీహెచ్‌ఎంసీ చేపడుతున్న చర్యలు పేదల పొట్టపై కొడుతున్నారనే ప్రచారానికి తావిస్తుండటంతో, వాటిని దూరం చేయటంతో పాటు ఫుట్‌పాత్‌లను మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంతో పాటు అవి ప్రజల కాలినడకకు, అవసరమైన చోట వారు సరుకులను కొనుగోలు చేసేలా తీర్చిదిద్దాలన్నదే ఈ మోడల్ వెండింగ్ జోన్ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మెయిన్ రోడ్లలోని, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసే రోడ్లకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఫుట్‌పాత్‌పై ఆక్రమణల తొలగింపు కోసం ఇప్పటికే షరతులతో కూడిన వ్యాపారాలకు అనుమతులను ఇచ్చేందుకు హాకర్స్ పాలసీ రూపొందించినా, అందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ లేకుంటే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశమున్నందున మోడల్ వెండింగ్ జోన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టి, అన్ని రకాల పనులు చెల్లిస్తూ ఏర్పాటు చేస్తున్న కొన్ని వ్యాపారాలకు గిరాకీ కావటం లేదని, ఎవరికెలాంటి పన్నులు చెల్లించకుండా అక్రమంగా రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్న వ్యాపారులను ఒక ప్రత్యేక విధానం కిందకు తీసుకురావాలన్నదే ఈ వెండింగ్ జోన్ల ఉద్దేశ్యమని మేయర్ చెప్పారు. ఈ వెండింగ్ జోన్ల నిర్వాహణకు అవసరమైతే, జీహెచ్‌ఎంసీలోని కొన్ని విభాగాలకు చెందిన సిబ్బందిని కూడా నియమించాలని భావిస్తున్నారు.

నీటి పొదుపే మేలు
షాద్‌నగర్, ఏప్రిల్ 18: నిరంతర విద్యుత్ సరఫరా అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. బోరుబావుల్లో నుంచి పంట పొలాల్లోకి నిరాటకంగా నీరు చేరుతుంది. నీరు పొదుపుపై రైతుల్లో చైతన్యం లేకపోవడం, భూగర్భ జలాల సమస్య గురించి ఆలోచించకపోవడంతో అనేక ప్రాంతాల్లో పంట అవసరానికి మించి నీరు వాడుతున్నారు. ఈ తరుణంలో భూగర్భ జలాలకు శాపంగా మారే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, జిల్లేడు చౌదరిగూడ, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణలో రైతులుల వరి సాగు చేశారు. కొన్నిచోట్ల మొక్కజొన్నతో పాటు కూరగాయలు, పూలతోటలు వేశారు. మొక్కజొన్నకు నీటి అవసరం అంతగా లేకపోయినా వరి, కూరగాయలకు మాత్రం కొంత ఎక్కువగానే నీరు అవసరం ఉంటుంది. నెల రోజుల్లో వరి పంట కోతకు చేరనుంది. కూరగాయలు ఇప్పుడిప్పుడే మొగ్గ, పిందె దశలో ఉండటం వల్ల నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది. టమాట, వంకాయ, బీరకాయ, మిరప, కాకర, బెండ వంటి కూరగాయలు ఎక్కువగా సాగు చేశారు. అటు కూరగాయలైనా, ఇటు వరి పంట అయినా దిగుబడి రావాలంటే నీరు సమృద్ధిగా పెట్టాల్సిందే. కొన్నిచోట్ల రైతులు నీటి వసతి సక్రమంగా లేకున్నప్పటికీ పరిమితికి మించి సాగుచేశారు. దాంతో పంటకు నీరు అందిచాలన్న ఆశతో నిరంతరాయంగా మోటర్ల ద్వారా నీరు తోడుతున్నారు. ఇలాంటి చర్యలతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఫరూఖ్‌నగర్, కొత్తూరు మండలాల్లో ఇప్పటికే బోర్లలో నీరు తగ్గి సన్న దారగా వస్తున్నాయి. కొందుర్గు మండలంలో 200 అడుగుల లోతుగా ఉండే భూగర్భజలాలు ఇటీవల 400 అడుగుల లోతుకు పడిపోయినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల అంచనా. వర్షపునీటితో కళకళలాడిన చెరువులు ప్రస్తుతం నీరు తగ్గుతుండటంతో వెలవెలబోతున్నాయి.
ఆటోమెటిక్ స్టాటర్లతో ఇబ్బంది
గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ శాతం మంది రైతులు తమ బోర్లకు ఆటోమేటిక్ స్టాటర్లు ఏర్పాటు చేసుకోవడంతో నీరు పంటకు సరిపడ రావడంతోపాటు అలాగే నడుస్తుండంతో నీరు వృధా అవుతుంది. ఆటోమేటిక్ స్టాటర్లు తీసివేయాలని అధికారులు రైతులకు సూచించినా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. కొన్నిచోట్ల అలాగే కొనసాగుతునే ఉన్నాయని చెప్పవచ్చు. తొలి దశలోనే ఆరుతడి పంటలు పెంచుకునేలా ప్రొత్సాహం అందిచాల్సిన వ్యవసాయ శాఖ స్పందిచకపోవడంతో వరి సాగు ఈ విడత ఒక్కసారిగా పెరిగింది. గత సీజన్‌లో మొక్కజొన్నకు ఆశించిన స్థాయిలో ధర రాకపోవడం వర్షానికి తడిసి నాణ్యత తగ్గిన పత్తి కొనుగోలు భారంగా మారడంతో ఈ విడత రైతులు ఈ రెండు పంటలను పక్కన పెట్టి వరి, కూరగాయల వైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటిపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. నిరంతర విద్యుత్‌ను అవసరానికి అనుగుణంగా వాడుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ముందు చూపుతో పెరిగిన భూగర్భ జలాలను కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
రైతుల్లో అవగాహన కల్పిస్తాం: ఏడీఏ భిక్షపతి
రైతులకు సాగు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నట్లు షాద్‌నగర్ వ్యవసాయ శాఖ ఏడిఏ భిక్షపతి వివరించారు. నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని నీరు పొదుపుగా వినియోగించే విధంగా రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు వివరించారు. అవసరమైతే గ్రామాల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.