హైదరాబాద్

జోరుగా దుర్గం చెరువు బ్రిడ్జి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు జోరుగా సాగుతున్నాయి. సుమారు రూ.184 కోట్ల వ్యయంతో దాదాపు 764.38 మీటర్ల పొడువున నిర్మిస్తున్న వంతెన పనుల్లో భాగంగా 13 ఫౌండేషన్ల పనులు జోరుగా కొన సాగుతున్నాయి.
ప్రస్తుత ం 425.85 మీటర్ల పొడువున బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరమయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన వయోడక్ట్‌లను నిర్మించేందుకు కొండాపూర్‌లో ప్రత్యేకంగా కాస్టింగ్ యార్డును ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ 26న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు చేతుల మీదుగా ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి.
దుర్గంచెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించుకోగా, ఇప్పటి వరకు సంవత్సర కాలం పూర్తయింది. మిగిలిన మరో ఆరు నెలల్లో బ్రిడ్జి పనులను వేగవంతం చేసి, పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 50.80లక్షలతో ఇప్పటికే ధుర్గం చెరువులోని గుర్రపుడెక్కను తొలగించారు.
చెరువు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు గాను రూ.90లక్షల వ్యయంతో మూడు వేల పైచిలుకు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా కొనేరును ఏర్పాటు చేశారు.
రూ.90లక్షల వ్యయంతో పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో వైట్‌టాపింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు.
చారిత్రక నేపథ్యం ఉన్న దుర్గం చెరువు 1518లో కుతుబ్‌షాహి పాలనలో నిర్మితమైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గోల్కొండకు ప్రధాన మంచినీటి వనరుగా ఉండేదని కూడా చెబుతున్నారు. 1970లో ఈ చెరువును పీడబ్ల్యుడీ శాఖ పునరుద్ధరించింది.
మొత్తం 184 ఎకరాల ఆయకట్టు కల్గిన ఈ చెరువును సీక్రెట్ చెరువుగా కూడా పిలుస్తుంటారు. కాలుష్య కాసారంగా, ఆక్రమణలకు నిలయంగా మారిన ఈ చెరువుకు పూర్వవైభవాన్ని తీసుకురావటంతో పాటు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం, చెరువు సుందరీకరణ పనులన్నీ పూర్తయిన తర్వాత చెరువు పరిసర ప్రాంతాలు అదనపు శోభను సంతరించుకోనున్నాయి.

హరితహారం లక్ష్యాన్ని సాధించాలి
* అధికారులకు కలెక్టర్ ఉమర్ జలీల్ ఆదేశం
వికారాబాద్, ఏప్రిల్ 19: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాదికిగాను అన్ని శాఖల వారీగా అధికారులకు కేటాయించిన లక్ష్యాన్ని 25వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ.. గత ఏడాది నాటిన మొక్కలను సంరక్షించేందుకుగాను నోడల్ అధికారులందరూ తమకు కేటాయించిన మండలాల్లో ప్రతి శుక్రవారం వాటరింగ్ డే నిర్వహించి మొక్కలకు నీరు పోసి రక్షించాలని సూచించారు. మొక్కల సంరక్షణలో భాగంగా ప్రతి శుక్రవారం చేపట్టే చర్యలపై డీఆర్‌డీవోకు నివేదిక పంపాలని చెప్పారు. మొక్కల వివరాలను గ్రామ పంచాయతీలలోని గ్రీన్ పుస్తకంలో నమోదు చేయాలని పేర్కొన్నారు. వచ్చే రెండు నెలలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, నాటిన మొక్కలు ఎండిపోకుండా మొక్కల సంరక్షణకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది హరితహారంలో భాగంగా శ్మశాన వాటికలు, చర్చిలు, ఈద్గా మైదానాల చుట్టూ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ ఏడాదికి నర్సరీలలో పెంచే మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని తెలిపారు. ఎండల తీవ్రతకు పిచ్చుకలు, పక్షులకు నీరు, ఆహారం అందక చనిపోతే వీటి ఉనికికే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని రక్షించుకునేందుకు నీటి తొట్టెలు, అవసరమైన ఆహారం అందజేసేందుకు కృషి చేయాలని సూచించారు.
అటవీశాఖ పిచ్చుకల సంరక్షణకు రూపొందించిన బ్యానర్‌ను ఆవిష్కరించారు. 2018 అక్టోబర్ నాటికి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకం కింద కొత్త పాసు పుస్తకాల పంపిణీ, సంబంధిత రైతు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేసి డిజిటల్ సంతకాలు చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ కుమారి, డీఆర్‌వో జీ.సంధ్యారాణి, డీఆర్‌డీవో పీడబ్ల్యూ జాన్సన్, డీఎఫ్‌వో శ్రీలక్ష్మి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్, వికారాబాద్ ఆర్డీవో విశ్వనాథం, తాండూర్ ఆర్డీవో వేణుమాధవ రావు పాల్గొన్నారు.

రూర్బన్ పనులను వేగవంతం చేయాలి
* కలెక్టర్ జలీల్ ఆదేశం
తాండూరు మండలంలో వివిధ శాఖలకు రూర్బన్ పథకం కింద కేటాయించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో రూర్బన్ పథకానికి సంబంధించిన అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రూర్బన్ పథకం కింద పూర్తి చేసిన పనులకు తక్షణమే నిధులను చెల్లించాలని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు పూరె్తైన పనుల వివరాలను తమకు అందజేయాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో పీడబ్ల్యూ జాన్సన్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఈవో రేణుకా దేవి, డీడబ్ల్యూవో జ్యోత్స్న, డీసీఎస్‌వో సీ.పద్మజ, తాండూర్ ఆర్డీవో వేణుమాధవ రావు, తహశీల్దార్ రాములు, ఎంపీడీవో జగన్మోహన్, విద్యుత్, ఇరిగేషన్ పాల్గొన్నారు.