హైదరాబాద్

మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ైదరాబాద్, ఏప్రిల్ 19: కోటి మంది జనాభాకు పౌరసేవలు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులను చేపడుతున్న జీహెచ్‌ఎంసీకి ఈ సంవత్సరం అవార్డుల పంటగా మారింది. ఇప్పటికే స్కోచ్ అవార్డులను కైవసం చేసుకున్న జీహెచ్‌ఎంసీకి దేశంలోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీకి కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, గ్రీవెన్స్‌ల విభాగం కార్యదర్శి కేవీ ఈపెన్ పంపిన లేఖలో తెలియజేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో జీహెచ్‌ఎంసీని ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. అవార్డులను ఈనెల 21న నిర్వహించే సివిల్ సర్వీసెస్ దినోత్సవలో భాగంగా న్యూదిల్లీలోని విజ్ఞాన భవన్‌లోవ జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ అవార్డులను అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 2010 వరకు నామినేషన్లు వచ్చినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పలు శాఖాధిపతులు, డిస్ట్రిక్ మెజిస్ట్రేట్లు, ఉన్నతాధికారుల నుంచి నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం ఐదు దశల్లో ఈ నామినేషన్లను పరిశీలించిన అనంతరం తుది జాబితాలో ఎంపికైన వారిని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారని తెలిపారు. గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఇంటర్వ్యూ చేసి అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకమే ఈ అవార్డు రావటానికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. జాతీయ స్థాయి ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు దక్కడంపై జీహెచ్‌ఎంసీ పాలక మండలి, అధికార యంత్రాంగం సమష్టి కృషిని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు ప్రత్యేకంగా అభినందించారు.
మేయర్ రామ్మోహన్ హర్షం
జీహెచ్‌ఎంసీకి ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు దక్కటం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ నగరంలో రూ.8598.58 కోట్ల వ్యయంతో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు.

ధూమపానం ప్రియులకు పోలీసుల దడ
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగేవారిపై కేసులు మూడు కమిషనరేట్‌లలో అమలు
గచ్చిబౌలి, ఏప్రిల్ 19: నగరంలో ధూమపానం ప్రియులకు పోలీసులు దడపుట్టిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధాజ్జలు నిశ్దంగా అమలు జరుగుతున్నాయి. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు పొగరాయుళ్లపై కేసులు నమోదు చేస్తు దడపుట్టిస్తున్నారు. సిటీలో బహిరంగ దూమపానం నిషేధంపై తీవ్ర చర్చనీయాంవంగా మారింది. ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నాట్లు ప్రచారం జరగుతుంది. సైబరాబాద్‌లో సగటున రోజుకి వందకు పైగా కేసులు నమోదు చేసి పొగరాయుళ్లను కోర్టుకు పంపుతున్నారు. పాన్‌షాపులు, బస్టాండ్‌లతో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో పోలీసులు నాకాబందీ తనిఖీల తరహలో పొగరాయుళ్ల భరతం పడుతున్నారు. ధూమపానం చేస్తున్న వారి ఫొటోను ట్యాబ్‌లో చిత్రీకరిస్తున్నా పోలీసులు.. వివరాలను తీసుకుని ఉదయం ఆధార్ కార్డుతో కోర్టుకు హాజరు కావాలని సూచిస్తున్నారు. పొగ తాగుతూ పోలీసులకు చిక్కినవారు ఉదయం కోర్టుకు హాజరై అపరాధ రుసుము రూ.500 వరకు జరిమాన చెల్లించి వస్తున్నారు. ప్రస్తుతం నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం అన్ని వర్గాలలో చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం నగరంలో పాశ్చాత్య సంస్కృతి పరుగులు పెడుతున్న తరుణంలో సిగరెట్ ష్యాషన్‌గా మారింది. ధూమపానం కేసులు ఎలాంటి దుమారం లేపుతాయోనని పలువురు పొగరాయుళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు విదేశీ మహిళపై పోలీసులు కేసులు వేయలేదు, వారికి వేసులు బాటు కల్పిస్తే మన వారు ఉరుకుంటారా వేచి చూడాలి. బహిరంగ ప్రదేశల్లో ధూమపానం అమలు మంచిదే అయినప్పటికీ ప్రజలకు హెచ్చరికలు, అవగహన కల్పించకుండా పోలీసులు కేసులు వేయడంపై దూమపానం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు తరహలో స్మోకింగ్ ఏర్పాటు చేసి అనంతరం నిషేధం అమలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.