హైదరాబాద్

పానీ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: వేసవి కాలం ప్రారంభం కావడంతో గ్రేటర్ పరిధిలోని ప్రైవేటు నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. రక్షిత మంచినీటిని, మినరల్ వాటర్ అని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఎలాంటి గుర్తింపు లేకుండా నీటి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుని ప్రైవేటు సంస్థలు నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్నారు. ఎలాంటి నాణ్యత పాటించకుండా ఇష్టమొచ్చిన నీటిని మినరల్ వాటర్‌గా మారుస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటి వరకు పలు సార్లు ఐఎస్‌ఓ సర్ట్ఫికెట్‌ను పొందిన జలమండలి ఈ ఏడాది కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడటం లేదు. జలమండలి మంచినీటి సరఫరా నాణ్యత ప్రమాణాలను మొత్తం ఐదు దశలుగా కొనసాగిస్తున్నారు. జలమండలి నీటిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటివ్ మెడిసన్ (ఐపీఎం), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైనె్సస్ (ఐహెచ్‌ఎస్), జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాలతోపాటు జీహెచ్‌ఎంసీకి చెందిన అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు నాణ్యత పరీక్షలను నిర్వహిస్తారు. క్లోరినేషన్ శాతం, టర్బిటిటీ, రంగు తదితర వాటిపైకూడా పరీక్షలు జరుపుతున్నారు. ప్రతిరోజూ ఎన్నో నమూనాలను స్వీకరించి పరీక్షలు జరుపుతున్నారు. నగరంలో బహుళజాతి సంస్థలకు సంబంధించి 4, 5 కంపెనీలు మినహా మిగిలినవి ఆరోగ్యానికి ప్రమాదకరమేనంటూ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఇతరత్రా సంస్థలు దాదాపు 1500కు పైగా ఉన్నాయి. నగర శివార్లను కేంద్రాలుగా చేసుకుని నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు లేనివి, ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితమైన చర్యలుచేపట్టని పక్షంలో ప్రజలు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నారు. మంచినీటి కలుషితంతోనే ఎక్కువ రోగాలు వస్తున్నట్లు ఇటీవలే వైద్య అధ్యయనాలు చెబుతున్నా, ప్రజలకు కనీసం సురక్షిత మంచినీటిని అందించటంలో పాలకులు విఫలమవుతున్నారు. ఫలితంగా నాణ్యత, మినరల్స్ లేని నీటిని సేవించటం వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. గ్రేటర్ ప్రజలకు నీటి సరఫరాను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరిల నుండి వచ్చే నీటిని శుద్ధిచేసిన తరువాత మంచినీటిని నాణ్యతతో సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్లాంట్‌లను ఏర్పాటుచేసి నాణ్యతలు పాటించకుండా నీటిని విక్రయిస్తున్నాయి. ఇలాంటి నాణ్యత పాటించని వాటర్ ప్లాంట్లు ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటూ ఇష్టమొచ్చిన ధరలకు వాటర్ క్యాన్లను విక్రయిస్తున్నా, నియంత్రణ కొరవడింది. ఇలాంటి వాటర్ ప్లాంట్లపై ప్రభుత్వ నిఘా కొరవడినందున, పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇలాంటి వాటర్ ప్లాంట్‌లపై గట్టి నిఘా ఏర్పాటుచేసి మంచి నీటిని ప్రజలకు అందిచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ఉప్పల్, ఏప్రిల్ 19: చెంగిచర్ల పారిశ్రామిక వాడలోని రీగల్ ల్యాబొరేటరీస్ (స్పిరిట్) తయారీ పరిశ్రమలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక దళాన్ని రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో వౌలాలి, తార్నాక ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పివేశారు. పొగతో ప్రాంతమంతా కమ్ముకుపోవడంతో చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో కార్మికులు ప్రభాకర్ (30), యాదయ్య (40) గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంజిరెడ్డి తెలిపారు.