హైదరాబాద్

సిలిండర్ల పంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 20: భారత ప్రభుత్వం పేద కుటుంబాల్లో వెలుగు నింపేందుకు మెరుగైన జీవితం కోసం స్వచ్ఛమైన ఇంధనం (ఎల్‌పీజీ) గ్యాస్ కల్పిస్తోంది. 2011 ఆర్ధిక జనగణన ప్రకారం మహిళల పేరున అందిస్తోంది. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తూ పొగ రహితమైన ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో హరిజన, గిరిజన, బలహీన వర్గాలకు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని శుక్రవారం ఉప్పల్‌లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డీలర్ రమేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రారంభించారు. అట్టడుగు వర్గాల్లో వెలుగు నింపాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబం అందుకోవాలని పిలుపునిచ్చారు. ఆధార్, తెల్ల రేషన్, బ్యాంక్ అకౌంట్, ఫోటోలు, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో వస్తే ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 800 దీపం కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. ప్రతి గుడిసెలో గ్యాస్ కనెక్షన్ ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే ప్రతి పేద కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అందరికీ అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఐఓసీ డీజీఎం సంఘమిత్ర సమల్, సివిల్ సప్లయిస్-సర్కిల్-2 అధికారి ప్రేమ్ కుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల, బీజెపీ నేతలు గొరిగె కృష్ణ, ఎం.లక్ష్మణ్, ఈగ శ్రీనివాస్, బొంగు రమేశ్, శ్రీనివాస శర్మ, బలవంతచారి, రావుల బాలకృష్ణ గౌడ్, రేవెల్లి రాజు, ఆర్.దేవేందర్ రెడ్డి, జంగయ్య, ఐఓసీ డీలర్లు రమేశ్ గుప్త, ఈశ్వర్ కుమార్ పాల్గొన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాల్లోని గ్యాస్ సర్వీసు కేంద్రాలలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని స్థానిక బీజేపీ నేతలు ప్రారంభించారు.
నిరుపేదలకు ఉచిత గ్యాస్ పంపిణీ
షాబాద్: నిరుపేదలకు ఉచితంగా భారత్ గ్యాస్ అందించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు షాబాద్ భారత్ గ్యాస్ నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని మన్‌మర్రి గ్రామంలో గ్యాస్ లేని వారికి సర్పంచ్ సత్యనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ్ధర్‌రెడ్డి, బీజేవైయం జిల్లా ఉపాధ్యక్షుడు రాము గ్యాస్ సిలిండర్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాన్‌మంత్రి ఉజ్వల్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ జయంతి రోజున పథకాన్ని ప్రారంభించారని వివరించారు. దేశంలో మహిళలు కట్టెలతో వంట చేయడంతో అనారోగ్యంతో బాధ పడుతున్నారనే ఈ పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దేశంలో సుమారుగా 5 కోట్ల మంది కుటుంబాలకు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 20 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హూలైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీందర్‌రెడ్డి గ్రామస్తులు చంద్రశేఖర్‌రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
అందరికీ సంక్షేమ పథకాలు
అల్వాల్: కంటోనె్మంట్‌లో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించటానికి కృషి చేస్తున్నామని కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి. సాయన్న చెప్పారు. శుక్రవారం కంటోనె్మంట్ ఎడవ వార్డు పరిధిలో ప్రధానమంత్రి ఉజ్వల పథకం క్రింద మంజూరైన నూతన గ్యాస్ కనెక్షన్‌లను మహిళలకు పంపిణీ చేశారు. కంటోనె్మంట్‌లోని పేదలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందజేసి వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామనీ వివరించారు. బస్తీలు, కాలనీల వారిగా వారి అవసరాల మేరకు వౌలిక సమస్యలు పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటున్నామనీ గతంలో దీపం పథకం కింద మహిళా గ్రూపులందరికీ గ్యాస్ కనెక్షన్‌లు మంజూరీ చేయించామని ఇంటింటికీ ఒక కనెక్షన్‌ను అర్హులైన వారందరికీ అందజేశామనీ ప్రస్తుతం ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడతామనీ సాయన్న చెప్పారు.
కార్యక్రమంలో కంటోనె్మంట్ బోర్డు పాలకమండలి వైస్ చైర్మన్ జె.రామకృష్ణ, బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టిఎన్.శ్రీనివాస్, బోర్డు సభ్యులు పాండుయాదవ్ స్థానిక బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వినీత, శంకర్‌రావు, సంతోష్, ఆనంద్, సరిత అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.