హైదరాబాద్

టింబర్ డిపోలో మంటలు - రూ.80 లక్షల ఆస్తినష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 20: ప్రమాదవశాత్తు టింబర్ డిపోలో మంటలు అంటుకోవడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయ సమీపంలో ఓ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.80 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్ళితే... కూకట్‌పల్లికి చెందిన బి.వి.సత్యనారాయణ చిత్తారమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్‌ను ఏర్పాటు చేసుకుని టేక్ ఉడ్ వస్తువులు తయారుచేసే డిపోను నిర్వహిస్తున్నాడు. అతనితోపాటు మరి కొందరు సెంట్రింగ్ కర్రల దుకాణం, టిఫిన్ సెంటర్లు, చెరుకు రసం, పండ్ల దుకాణాలు ఉన్నాయి. వీరి దుకాణాల సమీపంలోనే 20కి పైగా కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో షాపుల వెనుకాల నుంచి మంటలు రావడం మొదలవ్వడంతో గాలికి పక్కనే ఉన్న దుకాణాలకు ఎగబాకాయి. ఆయా షాపులలో చెక్కకు సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉండడంతో మంటలు త్వరగా వ్యాప్తిచెంది అన్ని దుకాణాలలోని కర్రలు, ఉడ్ సామాగ్రికి అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సుమారు 7 గంటల పాటు శ్రమించారు. కూకట్‌పల్లి, జీడిమెట్ల, సనత్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 6 అగ్ని మాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశారు. మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు 10 గంటల పాటు సిబ్బంది శ్రమించారు. ఆయా దుకాణాలలోని టేక్, కర్రలు, ఉడ్ సామాగ్రి అగ్నికి ఆహుతి కావడంతో సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

తప్పిన ప్రాణ నష్టం
మంటలు అంటుకున్న దుకాణాల సమీపంలో 30కి పైగా కుటుంబాలు గుడిసెలలో నివాసం ఉంటున్నారు. నిమిషాలలో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున గుడిసెల చుట్టూ పొగ వాటిల్లడంతో నిద్రలో ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడి గుడిసెలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే గాలులు గుడిసెల వైపు కాకుండా మరోవైపు వీయడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అప్పటికే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రోడ్డుకు మరోవైపు ఉన్న దుకాణాలలో నీళ్లు చల్లడంతో దుకాణాలకు మంటలు అంటుకోలేదు. గుడిసెలకు మంటలు అంటుకోకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

నేను సైతం ప్రాజెక్టు సిటీ పోలీస్‌కు ప్రోత్సాహం
హైదరాబాద్, ఏప్రిల్ 20: హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న కమ్యూనిటీ సిసిటివి ప్రాజెక్టు, నేను సైతం ప్రాజెక్టు, 17 వర్టికల్స్ వల్ల పోలీసులకు ఎంతో ప్రోత్సాహంగా ఉందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ హెచ్‌ఆర్‌డిలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలను పశ్చిమ మండలం డిసిపి సిబ్బందికి వివరించారు. దీని వల్ల పోలీసు పనితీరు మెరుగుపడేందుకు ఎంతో దోహదం జరిగిందని అన్నారు. డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఇటీవల కూకట్‌పల్లి జెఎన్‌టియులో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రాజెక్టుల ఉద్దేశ్యం, లక్ష్యాలు, పనితీరుగురించి చాలా స్పష్టంగా చెప్పిన సంగతిని డిసిపి గుర్తు చేశారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఎస్‌ఐ స్ధాయి వరకు ఉన్న అధికారులు అందరికీ సమగ్రంగా తెలిపేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.