హైదరాబాద్

గౌరవప్రదం..పోలీసు ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 20: పోలీసు శాఖలో పనిచేయడం గౌరవప్రదమని ప్రజల్లో వీరికి ఎంతో గౌరవం ఉంటుందని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మేరి ఎనాట్స్ పాఠశాలలో రెండు నెలలపాటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీసు కానిస్టేబుల్ ఉచిత శిక్షణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం నిరుద్యోగ యువతను గుర్తించి పోలీసు కానిస్టేబుల్ పరీక్షల అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఉచితంగా నిర్వహించే శిక్షణా తరగతులకు హాజరయ్యే అభ్యర్థులకు కోర్సు మెటీరియల్‌తో పాటు ఇతర సౌకర్యాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. పోలీసు కానిస్టేబుల్ పోటీ పరీక్షల అభ్యర్థుల ఎంపికకు ఐదువేల మంది దరఖాస్తు చేసుకోగా 1050 మందిని ఎంపిక చేశామని అన్నారు. శిక్షణ తరగతుల్లో బోధించే అంశాలు కానిస్టేబుల్ పోస్టులే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు సైతం ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. శిక్షణకు హాజరయ్యే యువతీ, యువకులు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ తరగతులకు హాజరయ్యే అభ్యర్థులు మొబైల్ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అలవాట్లు ఉన్నవారు వాటిని దూరం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల సందర్భంగా 17 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరు అన్ని టెస్ట్‌ల్లో పాల్గొనాలని తెలిపారు. ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్న తరుణంలో శిక్షణ తరగతులు ఎంతగానో ఉపకరిస్తాయని వివరించారు. శిక్షణా తరగతుల్లో పాల్గొనే అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి రోజు గుడ్డు, పండ్లకు అయ్యే ఖర్చును వెచ్చించాలని డీఆర్‌డీవో పీడబ్ల్యూ జాన్సన్‌కు కలెక్టర్ సూచించారు. అనంతరం శిక్షణ పొందుతున్నవారికి జిల్లా కలెక్టర్ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ, అదనపు ఎస్పీ పీ.నర్సింలు, డీఎస్పీలు శిరీష రాఘవేందర్, జీ.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ బీ.సత్యనారాయణరెడ్డి, శిక్షణ తరగతుల కోచ్ ఏఎస్‌పీ భానుకిరణ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు ఎం.వెకటరామయ్య, జే.ఉపేందర్, బీ.శ్రీనివాస్, ఎస్‌ఐలు, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అందరికీ గ్యాస్ కనెక్షన్లు
గచ్చిబౌలి, ఏప్రిల్ 20: దేశంలో పది కోట్ల కుటుంబాలు నేటికీ వంట చెరుకునే వినియోగిస్తున్నారని దీంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) జనరల్ మేనేజర్ బాల సుబ్రహ్మణ్యం చెప్పారు. మాదాపూర్‌లోని వెంకట సాయి గ్యాస్ ఏజెన్సీలో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా జీఎం మాట్లాడుతూ వంట చెరుకును వినియోగించడం వలన ఏటా 15లక్షల మంది మహిళలు శ్వాసకోశ వ్యాధుల బారినపడి మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంట చెరుకు వినియోగం వలన పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. 2020 నాటికి పది కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్‌లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఎస్సీ, ఎస్టీ కులాల మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌లు అందిస్తున్నామన్నారు. స్టౌవ్, గ్యాస్‌లకు గ్యాస్ సంస్థలు 16వందల రూపాయలను వడ్డీలేని రుణం అందిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో వెంకట సాయి గ్యాస్ ఏజెన్సీ ఎండీ వేణు, వార్డు నెంబర్ స్వర్ణలత, మేనేజర్ రాజుతో పాటు స్థానికులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వంద మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపీణీ చేశారు.

జోహార్ ఇంద్రన్న సీడీ ఆవిష్కరణ
రాజేంద్రనగర్, ఏప్రిల్ 20: ఇంద్రారెడ్డి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్ కాంగ్రెస్ నాయకులు సామ రాజ్‌పాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పటోళ్ల ఇంద్రారెడ్డి 18 వ వర్ధంతిని పురస్కరించుకొని జోహార్ ఇంద్రన్న సీడీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఇంద్రారెడ్డికి ఎనిలేని అనుబంధం ఉందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ని నియోజకవర్గంలో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మెన్ పి.కార్తీక్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.