హైదరాబాద్

రంజాన్‌కు ఏర్పాట్లు మక్కామసీదుకు ప్రత్యేక లైటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ముస్లింలు నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునే రంజాన్ పండుగకు జీహెచ్‌ఎంసీ విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఉపవాసదీక్షలను పాటించే ముస్లింలు, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఉపవాసదీక్షలను విరమించేందుకు మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సుమారు రూ. 7.86 కోట్ల వ్యయంతో సుమారు 197 పనులకు మంజూరీ ఇచ్చింది. ఎండాకాలం కావటంతో మధ్యాహ్నం, సాయంత్రం పూట ఎక్కువ మంది సామూహికంగా ప్రార్థనలు నిర్వహించే చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు వంటి ప్రార్థన స్థలాల వద్ద ప్రత్యేకంగా పండాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీలోని వివిధ ఇంజనీరింగ్ డివిజన్లలో రంజాన్ ఉపవాసదీక్షలు, పండుగ సందడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి మొత్తం ఆరు ఇంజనీరింగ్ డివిజన్లలో ఈ పండుగ ఏర్పాట్లను చేయనున్నారు. ఇందులో భాగంగా డివిజన్ 3లో రూ.కోటి 23లక్షల పైచిలుకు వ్యయంతో 37 పనులు, అలాగే డివిజన్ 6లో రూ.కోటి 28లక్షల 89వేల వ్యయంతో 45 పనులు, డివిజన్ 8లో రూ.2 కోట్ల 67లక్షల 30వేలతో 46 పనులు, డివిజన్ 9లో రూ.31లక్షల 91వేలతో 13 పనులకు, అలాగే డివిజన్ 10లో రూ.కోటి 37లక్షల 61వేల వ్యయంతో 41 పనులను, డివిజన్ 6లో రూ.97.5లక్షల వ్యయంతో 15 పనులను చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ మంజూరీ ఇచ్చింది. ఈ పనులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎప్పటికపుడు చెత్తను సేకరించి, తరలించేందుకు రూ.38.85లక్షల వ్యయంతో రూ. 133 కార్మికులను అదనంగా నియమించారు. అంతేగాక, ఆరు సర్కిళ్లలో ఏడు వాహనాలను అందుబాటులో ఉంచి, మరో 24 మంది కార్మికులను నియమించి చెత్తను ఎప్పటికపుడు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మక్కా మసీదును విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు రూ. 21లక్షలను జీహెచ్‌ఎంసీ మంజూరు చేసింది.

మే 17లోగా ఓటర్ల తుది జాబితా విడుదల చేయండి
హైదరాబాద్, ఏప్రిల్ 20: గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను మే 17 కల్లా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా తయారీ, విడుదల ఏర్పాట్లపై సచివాలయం నుంచి అన్ని జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా తాజా అసెంబ్లీ ఎన్నికల రోల్స్ ఆధారంగా రూపొందించి మే 17లోగా తుది జాబితాను సిద్ధం చేసి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మే 8 వరకు డ్రాఫ్ట్ ఎలక్టోరోల్స్‌లోని అభ్యంతరాలను స్వీకరించబడుతుందని, మే 10 వరకు సవరణలు పూర్తిచేసి, మే 17న వార్డుల వారీగా డీపీవోలు తుది జాబితాను విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు, నిర్మల్ కలెక్టర్ ఎం. ప్రశాంతి, డీసీ ఓ పద్మజ, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.