హైదరాబాద్

అర్థరాత్రి..ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రతి పనిని ఎపుడైనా తనిఖీ చేస్తామని స్పష్టీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 21: మహానగరంలోని పలు మెయిన్ రోడ్ల మరమ్మతుల పనులను రూ.700 కోట్లతో జీహెచ్‌ఎంసీ చేపడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత నగరవాసులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా ఎంతో ముందుచూపుతో, నాణ్యతతో పనులు చేపడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, నల్లగండ్ల సమీపంలోని ఫ్లైఓవర్, మసీదుబండలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను అర్థరాత్రి మేయర్ రామ్మోహన్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులేగాక, వివిధ రకాల అభివృద్ధి పనులను ఎపుడైనా ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు వివరించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లలో కూడా పూర్తిస్థాయిలో నూతనంగా రోడ్లను నిర్మించటం, మరమ్మతులను చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులను ముమ్మరం చేశామని వివరించారు. రోడ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని వివరించారు.
వర్షాలు, వరదల సందర్భంగా నీటి నిల్వలు ఏర్పడే వంద ప్రాంతాలను గుర్తించామని, ఆయా రోడ్ల మరమ్మతులను చేపట్టామని పేర్కొన్నారు.
అవసరమైన ప్రాంతాల్లో పేవర్ బ్లాకులతో రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో చీఫ్ ఇంజనీర్ జియావుద్దీన్, ఎస్‌ఈ మోహన్‌సింగ్ కూడా పాల్గొన్నారు.

తెరాస ప్లీనరీకి ఏర్పాట్లు పరిశీలించిన నేతలు
జీడిమెట్ల, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలకు నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో 27న జరిగే ప్లీనరీ సమావేశాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎంపీ మల్లారెడ్డి, బాల్క సుమన్, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేక్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు, రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సభా ప్రాంగణం, భోజన శాలలు, వీఐపీ పార్కింగ్ తదితర అంశాల పై చర్చించారు. అనంతరం పార్టీ జెండాలు, టీషర్ట్‌లను ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస నేతలు, బాలానగర్ జోన్ డీసీపీ సాయిశేఖర్, ఏసీపీ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

పాఠశాలల్లో సౌకర్యాలు
స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మరుగు దొడ్ల నిర్మాణం
బొంరాస్‌పేట, ఏప్రిల్ 21: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం మరుగుదొడ్లను నిర్మించేందుకు సన స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంచాయిత గజపతిరాజు శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించేందుకు మండల విద్యాధికారి రాంరెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. జిల్లాలోని తాండూర్, కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలను ఎంపిక చేశారు. ఎంపికైన మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంధ సంస్థ తరపున ఉచితంగా మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు సంచాయిత గజపతిరాజు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల కోసం మరుగుదోడ్లు నిర్మించామని, తెలంగాణ రాష్ట్రంలో కూడ నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పర్యటించి పాఠశాలలను పరిశీలిస్తున్నామని అన్నారు.