హైదరాబాద్

ఎంత చెప్పినా.. చైతన్యం ఏదీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌పై విధించిన నిషేధం రాజకీయ ప్రమేయం కారణంగా సక్రమంగా అమలు కావటంలేదు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఆశించిన స్థాయిలో అవగాహన పెరగటం లేదు.
ప్రస్తుతం నాలాల్లో తొలగిస్తున్న పూడికలో 40 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండటం.. ప్లాస్టిక్ వినియోగం ఏ మాత్రం తగ్గలేదనేందుకు నిదర్శనం. నగరంలో సుమారు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నాలాల్లోని పూడికను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ రూ.34.16 కోట్ల వ్యయంతో 29 పనులను చేపట్టేందుకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో 80 శాతానికి సంబంధించిన పనులకు టెండర్లు ఖరారయ్యాయి. నాలాల్లోని పూడికతీత పనులపై జీహెచ్‌ఎంసీ అధ్యయనం చేపట్టగా, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, నగరవాసుల బాధ్యతారహిత్యం బయట పడింది. సెంట్రల్ జోన్ పరిధిలోని షేక్‌పేటలోని విరాట్‌నగర్‌లో నాలా పూడికతీత పనులను పైలెట్ పద్ధతిలో అధ్యయనం చేయగా, ఈ నాలాలోని వ్యర్థాల్లో సుమారు 40 శాతం ప్లాస్టిక్ ఆధారిత వ్యర్థాలే ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు, పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ సంచుల్లో చెత్త కుప్పలు, చెక్క, కలప పదార్థాలు ఉన్నట్లు స్పష్టమైంది. క్వింటాల్ వ్యర్థాల్లో నీటి పరిమాణం ఇరవై శాతం వ్యర్థ, మురుగు నీరు, పూడిక, మన్ను కలిపి 40 శాతం, నీటిపై తేలియాడే పదార్థాలు 40 శాతం, కొబ్బరి బోండాలు, భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నట్లు తేలింది. ఒక్క విరాట్‌నగర్ నాలా పూడికలో ఈ విషయం బయటపడితే నగరంలోని మొత్తం అన్ని నాలాల్లోని వ్యర్థాలు ఏ మేరకుంటాయో అంచనా వేయవచ్చు.
నగరంలోని నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయరాదని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2168 మంది స్వచ్ఛదూత్‌లను నియమించి, ఇంటింటికీ పాఠాలు చెప్పిస్తున్నా, ఫలితం దక్కలేదు. ఒక్కో స్వచ్ఛదూత్ సుమారు 600 ఇళ్లకు వెళ్లి నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయరాదని, ఇంట్లో పోగయ్యే చెత్తను ఇంట్లోనే తడి, పొడిగా వేరు చేసి ఇవ్వాలని చెబుతున్నా, వారి మాటలను విని, పట్టించుకునే నగరవాసులు కొంత మందేనని తేలిపోయింది. దీనికి తోడు భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ వేయరాదని, వీటిని తరలించేందుకు ప్రత్యేకంగా నామమాత్రపు చార్జీలకే వాహనాలను అందుబాటులో ఉంచినా, నేటికీ నాలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు పడుతున్నాయంటే జీహెచ్‌ఎంసీ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ఏ మేరకు ఫలితాలిచ్చాయో అంచనా వేసుకోవచ్చు.