హైదరాబాద్

రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్-ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కనీసం రూ.20 వేల కోట్లతో బీసీ సబ్-ప్లాన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఆమోదించింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నగరంలోని సెంట్రల్ కోర్టులో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంఘం 31 జిల్లాల అధ్యక్షులు, 104 నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఇంకా ర్గా అరుణ్, వినయ శివశంకర్ (కాంగ్రెస్) సూర్యప్రకాష్ (బిఎల్‌ఎఫ్), ప్రొఫెసర్ ప్రభంజన్, ప్రొఫెసర్ గాలి వినోద్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, కొండ దేవయ్య, మున్నూరు కాపు సంఘం చైర్మన్ గొరిగె మల్లేష్ యాదవ్, వన్నడి రమ్య, గుజ్జ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో 16 తీర్మానాలను ఆమోదించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లును వెంటనే పార్లమెంటు ఆమోదించాలని, బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, బీసీల విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని తదితర డిమాండ్లను సమావేశం ఆమోదించింది.