రంగారెడ్డి

ఆటోను ఢీకొన్న డీసీఎం: మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఏప్రిల్ 23: డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయింది. మండల పరిధిలోని కందవాడ గేట్ వద్ద హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొన్న ప్ర మాదంలో మహిళ మృతి చెందిన సం ఘటన చోటు చేసుకుంది. పోలీసు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఉప్పరిపల్లికి చెందిన హైమద్ కుటుంబ సభ్యులు భార్య ఫరీనాబేగం (26), తల్లి సయద్‌బేగం, కూతుళ్లు మైయాక్, హర్ష, రిమ్షా, మోహిన్‌తో కలిసి సోమవారం ఉద యం ఆటోలో వికారాబాద్ జిల్లా కొం డగల్‌లోని దర్గాకు బయలుదేరారు. కందవాడ గేట్ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని డీసీ ఎం వ్యాన్ అతివేగంగా ఆటోను ఢీకొట్టడంతో కుడి వైపు కూర్చున్న ఫరీనాబేగం కుడి చెయ్యి విరిగి రోడ్డుపై పడిపోటంతోపాటు తలకు బలంగా దెబ్బ లు తగిలాయి. ఆటోలో ఉన్న మిగతావారికి గాయాలు కాలేదు. తీవ్ర గాయాలైన ఫరీనాబేగంను అదే ఆటోలో కాళిమందిర్‌లోని షాదాన్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెం దింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లేలోపు ఆసుపత్రికి వెళ్లిపోయారు. సిబ్బంది దర్యాప్తు చేయగా ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకొని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీ్ధర్ రెడ్డి తెలిపారు.