హైదరాబాద్

ఈ-వేలానికి అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 23: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో పలు లేఔట్లలో మిగిలిపోయిన ప్లాట్లను ఈ-వేలం ద్వారా తలపెట్టిన విక్రయ ప్రక్రియలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఊహించని విధంగా ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయంపై సంస్థ ఉద్యోగులు సోమవారం తార్నాకలోని కేంద్ర కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. ఈ-వేలం ప్రక్రియలో హెచ్‌ఎండీఏ అంచనాల కన్నా ఎక్కువ ధరకు ప్లాట్లు అమ్ముడుపోవడంపై కమిషనర్ టీ.చిరంజీవులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషిని కొనియాడారు. దినదినాభివృద్థితో సంస్థ పూర్వవైభవాన్ని సాధించుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ఉద్యోగులను పేరుపేరునా అభినందించారు. హెచ్‌ఎండీఏ ఈ-వేలం ద్వారా మొత్తం 87వేల చదరపు గజాల ప్లాట్లను విక్రయానికి పెట్టామని, రూ.200 నుంచి రూ.250 కోట్లు సమీకరించాలని అనుకుంటే అంతకు రెట్టింపుగా అనూహ్యంగా రూ.400 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితో తాము ఈ విజయం సాధించామని అభివర్ణించారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఇదే స్ఫూర్తితో కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు. 2015-16 సంవత్సరంలో సంస్థ వార్షిక ఆదాయం రూ.250 కోట్లు ఉండగా ఈ ఏడాది అనగా 2017-18కి రూ.870కోట్లకు పెరిగిందని అన్నారు. ఈ ఏడాది రెండువేల కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించడం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతూ పని చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో వెయ్యి కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. సమావేశంలో మెంబర్ ఎస్టేట్ లత, సీఇఓ శరత్ చంద్ర, ఎస్టేట్ అధికారి గంగాధర్, సీఐఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

ఎర్లీబర్డ్ వసూళ్లురూ.195 కోట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 23: కోటి మంది నగరవాసులకు అత్యవసర, అవసరమైన సేవలను అందించే జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థికవనరైన ఆస్తిపన్ను ముందస్తు వసూళ్ల కోసం అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ స్కీం మంచి ఫలితాలిస్తోంది. ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరం 2018-19కు సంబంధించిన ఆస్తిపన్నును ఈ నెలాఖరులోపు చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ ఇస్తూ అమలు చేస్తున్న ఈ స్కీం కింద ఇప్పటి వరకు రూ. 195 కోట్ల వరకు పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌లో సుమారు 6248 మంది రూ.4.30 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇతర మార్గాల ద్వారా మరో 13వేల 430 మంది బకాయిదారులు రూ.11.30 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మొత్తం రూ. 190 కోట్ల వరకు వసూలైనట్లు వెల్లడించారు.