హైదరాబాద్

ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి: కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 23: సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ అతి ముఖ్యమైన సమావేశాలని, కీలకమైన నిర్ణయాలు, ఫెడరల్ వ్యవస్థ, ఫెడరల్ స్ఫూర్తి ఉండాలని కేసీఆర్ అభిప్రాయమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి జీబీఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డితో పాటు మేయర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, భోజనశాలలు ఇతర ముఖ్యమైన అంశాలను పరిశీలించి దానికి సంబంధించిన నేతలను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో 2001లో ఉద్యమ సంస్థగా ప్రారంభించిన టీఆర్‌ఎస్ 17 వసంతాలను పూర్తి చేసుకుంటుందని అన్నారు. టీఆర్‌ఎస్ వార్షిక ప్రతినిధుల సభ ఈనెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్లీనరీలో భవిష్యత్తులో టీఆర్‌ఎస్ అవలంభించే కార్యక్రమాలతో జరుగుతాయని చెప్పారు. తీర్మానాల కమిటీ, ఆహ్వాన కమిటీ, సభావేదిక కమిటీ, ప్రతినిధుల నమోదు, పార్కింగ్ కమిటీ, నగర అలంకరణ కమిటీ, వాలంటీర్ల కమిటీ, ఫుడ్ కమిటీ, మీడియా కమిటీ, సాంస్కృతిక కమిటీతో సమావేశాలు జరుగుతాయని అన్నారు. సమావేశాలకు 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, 20 దేశాల నుంచి 100 మంది టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. తొమ్మిది ఎకరాలలో ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని, 80 ఎకరాల్లో పార్కింగ్, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. 119 నియోజకవర్గాల నుంచి 40 డెలిగేట్స్ నమోదు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎనిమిది భోజనశాలలు, వేసవి దృష్ట్యా అంబలి, చల్ల, తాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. శుక్రవారం అయినందున ముస్లింలకు ప్రత్యేకంగా నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. నాలుగు అంబులెన్స్‌లతో పాటు వైద్యుల బృందం, హెల్త్ క్యాంపులు, ఫైర్ సిబ్బందితో పాటు ఐదు ఫైరింజన్‌లు, పోలీసు సిబ్బంది, నగర, ప్రాంగణ అలంకరణ ఏర్పాట్లు, మీడియాకు మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థి యువజన విభాగానికి చెందిన 500 మంది వాలంటీర్లకు నేటి నుంచి శిక్షణ ఉంటుందని అన్నారు. మంగళవారం హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి.. శిక్షణను, మీడియా సెంటర్‌ను ప్రారంభిస్తారని వివరించారు. సాధారణ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ప్లీనరీ అతి ముఖ్యమైన సమావేశాలని, కీలకమైన నిర్ణయాలతో దేశంలో ఫెడరల్ వ్యవస్థ, ఫెడరల్ స్పూర్తి ఉండాలని కేసీఆర్ అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి నమూనా, మోడల్‌గా, ఆదర్శంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారుల బృందాలు వచ్చి తెలంగాణ మోడల్‌ని అనుసరిస్తున్నాయని వివరించారు. ప్లీనరీ కీలకమైన సమావేశాలని, చర్చ, పార్టీ అధ్యక్షుడు చేయబోయే దిశానిర్దేశం, భవిష్యత్ రాజకీయాలకు రాష్ట్రంలో, దేశంలో ఓ సూచికగా నిలబడతాయని పేర్కొన్నారు. పార్టీ ఆలోచనా విధానాన్ని, తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రంలో జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం కొనసాగుతుందని చెప్పారు. ఒక్కో నియోజకవర్గం నుంచి వంద మంది ప్రతినిధులు సగటున హాజరవుతారని, ప్లీనరీని ప్రతినిధుల సభగా జరుపుకుంటున్నామని తెలిపారు. మూసీ ఏవిధంగా సుందరీకరణ జరుగుతుందో అంతకంటే సుందరంగా ఫెడరల్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దుతామని అన్నారు. అసాధ్యమైన తెలంగాణను సుసాధ్యం చేశామని, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పనితీరును పొగడకుండా ఉండలేకపోతున్నారని చెప్పారు. దేశ రాజకీయాల్లో ప్లీనరీ దిక్సూచి అయినా ఆశ్చర్యం లేదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు సీహెచ్ మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కేపీ వివేక్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజు, ప్రభాకర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.