హైదరాబాద్

మండే కాలం ఎండలతో జర భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: మహానగరంలో రెండురోజులుగా ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, మెయిన్ రోడ్లు మధ్యాహ్నం రాకపోకలు లేక నిర్మానుష్య మవుతున్నాయి. సోమవారం కూడా అత్యధికంగా 39డిగ్రీల పైచిలుకు, కనిష్టంగా రాత్రి పూట 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా ఉష్ణోగ్రత 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావటం మున్ముందు ఎండ ప్రభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మంగళవారం నుంచి వచ్చే నెల 10, 12వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నిపుణులు, వైద్యులు ప్రజలకు సూచించారు. ఈ నెల 25 నుంచి 27వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 29గా నమోదయ్యే అవకాశముందని, అలాగే ఈ నెల 28 నుంచి గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీలకు పెరిగే అవకాశమున్నందున, ప్రజలు ఎండలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెల 12వ తేదీ వరకు ఇదే తరహాలో గరిష్టంగా 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మహానగరవాసుల జీవనంతో సంబంధమున్న జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌శాఖ, ఆర్టీసి, వైద్యారోగ్యశాఖ వంటి ముఖ్యమైన విభాగాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఎండల పెరిగినకొద్దీ ఉక్కపోత, వేడి పెరగటంతో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశముంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా ఎయిర్ కూలర్లు, కండీషనర్లతోపాటు శీతల పానీయాలకూ గిరాకీ మరింత పెరగనుంది.