హైదరాబాద్

మైండ్‌స్పేస్ అండర్‌పాస్ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో అత్యంత బిజీగా ఉండే హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ పార్కు తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే చెక్ పడనుంది. ఇరవై ఏళ్ల ముందు చూపుతో నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) కింద మైండ్‌స్పేస్ ప్రాంతంలో రూ. 25.78 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్‌పాస్ పనులు పూర్తయ్యాయి. అండర్‌పాస్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అండర్‌పాస్‌తో సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీ వైపు ఇరువైపులా వెళ్లే రాకపోకలు సజావుగా సాగేందుకు వీలు కలుగుతోంది. మొత్తం 350 మీటర్ల పొడువులో ఉన్న అండర్‌పాస్‌లో 83 మీటర్ల క్లోజ్‌డ్ బ్యాక్స్‌గా నిర్మించారు. 28.80 మీటర్ల వెడల్పు, ఐదున్నర మీటర్ల ఎత్తుతో ఇరువైపులా ఆరు లేన్ల క్యారేజ్ వేలను కూడా నిర్మించటంతో ట్రాఫిక్‌కు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో గంటలకు 14400 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రానున్న మరో ఇరవై సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాల సంఖ్య 31356కు పెరగవచ్చునని, అప్పటి వరకు ఈ అండర్‌పాస్ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అందుబాటులో ఉంటుందనేది అధికారుల అంచన. 2016 ఏప్రిల్ 2న ప్రారంభించిన అండర్‌పాస్ పనుల్లో భాగంగా భూగర్భ కేబుళ్లు, మంచినీటి పైప్‌లైన్లు, సీవరేజీ పైప్‌లైన్లు, ఆప్టిక్ట్ ఫైబల్ కేబుళ్లను తొలగించి, తిరిగి వాటిని అమర్చటంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు విధులు నిర్వర్తించారు. సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతంగా తొలగించి, ఈ అండర్‌పాస్ నిర్మాణ పనులను మంగళవారం నాటికి పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవలే బయోడైవర్సిటీ అండర్‌పాస్‌ను విజయవంతంగా ప్రారంభించటంతో వేలాది వాహనాల రాకపోకలకు సౌలభ్యం కలిగింది. ఎస్‌ఆర్‌డీపీలో రెండో ప్రాజెక్టుగా మైండ్‌స్పేస్ అండర్‌పాస్ త్వరలోనే అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాలతో పాటు చుట్టూ నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా వాహనరాకపోకలు వేగవంతమయ్యే అవకాశం ఉంది.