హైదరాబాద్

మరింత సరళీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టే భూ సేకరణలో ఆస్తులు కోల్పోయే బాధితులకు బల్దియా ఇచ్చే ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్)ను మరింత సులభతరంగా, పారదర్శకంగా, యజమానులకు మరింత ఎక్కువ ప్రయోజనాన్ని సమకూర్చే దిశగా అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నష్టపరిహారాన్ని నాలుగింతలు చేసిన జీహెచ్‌ఎంసీ టీడీఆర్ వివరాలన్నింటిని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపకల్పన చేస్తోంది. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న భూముల ధరలతో సేకరించే భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించటం బల్దియాకు భారం మారుతున్నందున, పరిహారానికి బదులుగా స్థల సేకరణ చేసిన తర్వాత మిగిలిన భూమిని యజమానికి కమర్షియల్‌గా, తమకు వెసులుబాటు ఉండేలా వినియోగించుకోవటమే టీడీఆర్ ముఖ్య ఉద్దేశ్యం. స్థల సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఈ పథకంతో అధికారులు అధిగమించటంతో పాటు యజమానులకు కూడా మిగిలిన భూమిని కమర్షియల్‌గా వినియోగించుకునే హక్కు సంక్రమిస్తుండటంతో ఇరువర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఈ టీడీఆర్ అమలవుతోంది. టీడీఆర్‌కు అంగీకరించిన యజమానులు అదనపు అంతస్తులు కూడా నిర్మించుకునేందుకు అనుమతులిస్తున్నారు. ఆస్తులు కోల్పోయిన వారు, టీడీఆర్ ఉన్న వారికి, జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు మధ్య దూరం పెరగటంతో.. టీడీఆర్ ఇప్పటి వరకు సక్రమంగా అమలు కాలేదు. ఇపుడు ఈ దూరాన్ని తగ్గించి, టీడీఆర్ ఉన్న వారి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. ప్రత్యేకంగా ఓ అప్లికేషన్‌ను కూడా అందుబాటులో తేనున్నారు.
ఈ అప్లికేషన్, వెబ్‌సైట్ వివరాలను జీహెచ్‌ఎంసీ జారీ చేసే అనుమతులతో అనుసంధానం చేసి, టీడీఆర్ కింద యజమానులు అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు వీలుగా సహకారం అందించనున్నారు. దీంతో ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్ తీసుకునేవారు నేరుగా అధికారులను సంప్రదించేందుకు, పారదర్శకంగా అనుమతులిచ్చేందుకు ఉపయోగపడుతోందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ కోసం సైట్ల కోసం అనే్వషించేవారు, టీడీఆర్ తీసుకుని డెవలప్‌మెంట్ చేసే వారు వెబ్‌సైట్‌లో లింక్ కావటంతో ఈ స్కీం విజయవంతంగా అమలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.