హైదరాబాద్

ఆస్తిపన్ను చెల్లింపునకు నేడే ఆఖరి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: జిహెచ్‌ఎంసి మహానగర వాసులకు పౌరసేవలు, అలాగే అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్ల కోసం అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలు వసూళ్లకు గురువారం చివరి రోజు కావటంతో అధికారులు బుధవారం మొండి బకాయిదారులతో ప్రత్యేక చర్చలు కొనసాగించారు. ఇప్పటికే దీర్ఘకాలంగా బాకీలున్న మొండి బకాయిదారుల్లో కొందరికి రెడ్ నోటీసులు, మరికొందరికి ఇంట్లో సామానులను సీజ్ చేస్తున్నట్లు వారెంట్లు జారీ చేసిన అధికారులు వారికి కమిషనర్ పెట్టిన టార్గెట్ మేరకు పన్ను వసూలు చేసేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 13లక్షల పై చిలుకు పన్ను ఖాతాదారులుండగా, వీరిలో రూ.1200 లోపు పన్ను చెల్లించే సుమారు 5లక్షల 7వేల మంది బకాయిదారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన కుదింపుతో ఈ ఖాతాల వసూళ్ల భారం నుంచి అధికారులకు ఒక రకంగా మినహాయింపు లభించినట్టయింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం మొత్తం రూ. 1100 కోట్ల వసూళ్లను అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందులో ముఖ్యమంత్రి ఇచ్చిన కుదింపు మేరకు రూ. 88 కోట్లను మినహాయించగా, మిగిలిన సుమారు వెయ్యి 12 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 900 కోట్ల వరకు వసూలు కాగా, మిగిలిన రూ. 112 కోట్లను అధికారులు ఈ రోజు రాత్రి పనె్నండు గంటల్లోపు వసూలు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. వసూళ్లకు చివరి రోజైన గురువారం ఒక్కరోజే సుమారు రూ. 75 కోట్ల వరకు వసూలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ స్థాయిలో పన్ను వసూలు చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు మొదలుకుని సర్కిల్ డిప్యూటీ కమిషనర్లతో పాటు అదనపు కమిషనర్లకు కూడా పన్ను వసూళ్ల టార్గెట్లు విధించటంతో వీరంత గురువారం అర్థరాత్రి వరకు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇంకా సమయమున్నందున ఎక్కువ మొత్తంలో బకాయి పడ్డ మొండి బకాయిదార్లతో గురువారం నుంచి వసూళ్ల చివరి నిమిషం వరకు అధికారులు ఎప్పటికపుడు వారికి ఫోన్లు చేసి మాట్లాడటం, లేక నేరుగా సంప్రదించటంతో పాటు సెల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించటం, వాట్సప్‌లో మేసేజ్‌లు పంపటం వంటివి చేయాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆగి ఉన్న రైలు బోగీలో
చెలరేగిన మంటలు
హైదరాబాద్, మార్చి 30: నాంపల్లిలోని హైదారాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆరో ఫ్లాట్‌ఫాంపై ఆగి ఉన్న రైలు ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బోగీ పూర్తిగా దగ్ధమైంది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోగీలో మంటలు రావడంతో ఉద్యోగులు, అధికారులు భయబ్రాంతులకు గురయ్యారు.

నిరుద్యోగ యువకులకు విదేశాల్లో అవకాశాలు
హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఈ సంవత్సరం 5వేల మంది, వచ్చే సంవత్సరం 10వేల మందికి అవకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖామాత్యులు నాయిని నర్సింహ్మారెడ్డి వెల్లడించారు. మల్లేపల్లి ఐటిఐ క్యాంపస్‌లో బుధవారం దుబాయి బజారే లిమిటెడ్ కంపెనీ తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశ ఉద్యోగ మేళను హోం మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగాలకోసం ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్న నిరుద్యోగులను, విదేశాల్లో పనిచేస్తున్న వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో 2014లో విదేశాంగ శాఖ అనుమతితో ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారుల బృందం ఫిబ్రవరిలో దుబాయివెళ్లి అక్కడి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఆ అభ్యర్థనపై టామ్‌టామ్ కంపెనీ ఐటిఐ స్థాయిలోని అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఈ రోజు ఇంటర్‌వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో 750మందికి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు టామ్‌టామ్ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. దుబాయిలో ఇబ్బందులేమన్న ఉంటే పరిష్కరించేందుకు కంపెనీ తరఫున శ్రీనివాసరావును ఆక్కడ ఆర్డినేటర్‌గా నియమించామని, అతని సహాయాన్ని పొందవచ్చన్నారు. హోం కార్యదర్శి రాజీవ్ త్రివేది మాట్లాడుతూ రాష్ట్రంనుండి విదేశాలకు వెళ్లేవారు శ్రమ దోపిడికి గురికాకుండా ఉండేందుకు ఈ పద్ధతిని సిఎం కేసిఆర్ ఆలోచించారని అన్నారు. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లిన వారు కేవలం ఉద్యోగస్తులగానే కాకుండా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఎండి కెవై నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, హోం మంత్రి చొరవతో ఈ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని, హోంమంత్రి, ఎంపి కవితల ఆధ్వర్యంలో తాము సంప్రదింపులు జరిపితే మూడు కంపెనీలు అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ రిక్రూట్‌మెంట్స్ రెండురోజులపాటు హైదరాబాద్‌లోనూ, ఒకరోజు నిజామాబాద్‌లో జరుగుతాయన్నారు. జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నైపుణ్యం ఆధారంగానే రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయని, కంపెనీ తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ కంపెనీ జిఎం భవానీ తదితరులు పాల్గొన్నారు.