హైదరాబాద్

‘పుచ్చలపల్లి’ జీవితం ప్రపంచానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 19: పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ప్రపంచానికే ఆదర్శమని సీపీఎం నేతలు కురుమయ్య, ఈశ్వర్‌నాయక్ అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 33వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కురుమయ్య, ఈశ్వర్‌నాయక్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వాలను ప్రశ్నించిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని పేర్కొన్నారు. భూస్వాములు, పెత్తం దారులు చేస్తున్న అరాచకాలపై ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి సుందరయ్య అని గుర్తు చేశారు. అంటరాని తనాన్ని రూపుమాపి సహాపంక్తి భోజనం చేయించినట్లు వివరించారు. దళితులకు దేవాలయాల్లోకి రానిచ్చేవారు కాదని, అలాంటి పరిస్థితుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమాలు చేసి దళితులకు అలయ ప్రవేశం చేయించినట్లు తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినట్లు వివరించారు. సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు నర్సింలు, ప్రశాంత్, ఫైజల్, శంకర్‌నాయక్, గోపాల్ పాల్గొన్నారు.
కొత్తూరులో..
కొత్తూరు రూరల్: స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బీస సాయిబాబా కోరారు. శనివారం కొత్తూరు మండల కేంద్రంలోని సీఐటీయు కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 33వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. బీస సాయిబాబా మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.
కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఎంచుకొని భారతదేశ చరిత్రలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారని వివరించారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.రాజు, బీఎల్‌ఎఫ్ నాయకులు దర్శన్ గౌడ్, సురేష్, రవి, శ్రీను, నర్సింహా, ప్రకాష్, వెంకటయ్య పాల్గొన్నారు.
కాచిగూడ: తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య కీలక పాత్ర పోషించారని పలువురు వక్తలు కీర్తించారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సభ శ్రీత్యాగరాయ గానసభ, చైతన్య కళా భారతి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా లలితకళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త రమణ వెలమకన్ని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, ఆత్మీయ నిర్మల పాల్గొని పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి అని కొనియాడారు. కమ్యూనిస్ట్ యోధునిగా అనేక పోరాటాలలో పాల్గొన్నారని తెలిపారు.

కంటోనె్మంట్ గాంధీ కాలనీలో తనిఖీలు
అల్వాల్, మే 19: కంటోనె్మంట్‌లోని జూబ్లీ బస్సు స్టేషన్ వద్ద ఉన్న గాంధీకాలనీలో నార్త్ జోన్ డీసీపీ సుమతి అధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించారు. గాంధీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్మించిన వాల్మీకి - అంబేద్కర్ యోజన, జేఎన్‌యూ ఆర్‌ఎం పథకాల కింద నిర్మించిన వీకర్ సెక్షన్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో 150 మంది పోలీసులు పాల్గొన్నారు. సరియైన పత్రాలు లేని 15వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 10మంది అనుమానితులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతు నార్త్‌జోన్ పరిథిలోని ప్రతి పోలీస్ స్టేషనలో సమస్యాత్మకమైన బస్తీలు , కాలనీలలో సంఘ వ్యతి రేక కార్యక్రమాలు జరగ కుండా నిరంతరం తనిఖీలు చేసి శాంతి భ్రదతలు కాపాడటానికి చర్యలు తీసుకుంటామనీ ప్రజలు సహకరించాలనీ కోరారు.