క్రైమ్/లీగల్

దుర్గ్భావాని వైన్స్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మే 19: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గ్భావాని వైన్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోంగతనం చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని ముద్దెం గూడ గ్రామానికి చెందిన మాల మహేందర్ (25) గత కొంత కాలంగా వైన్స్‌లో పని చేస్తున్నాడు, అతనికి నెలకు రూ. 10వేలు జీతం ఇస్తున్నారు. వైన్స్ నిర్వాహకులకు తెలువకుండా క్యాష్ కౌంటర్ నుంచి రూ.2లక్షల 65వేల రూపాయలను దొంగలించారు. వైన్స్ నిర్వహకుడు బుచ్చిరెడ్డి క్యాష్ కౌంటర్‌లో రూ. 2లక్షలు తక్కువగా వస్తుందని వాటిని ఇవ్వాలని గట్టిగా చెప్పడంతో మహేందర్ ఓప్పుకున్నాడు. బుచిరెడ్డి ఫిర్యాదు మేరకు చేవెళ్ల ఏసీపీ స్వామి ఆదేశాల మేరకు సీఐ గురువయ్య గౌడ్ రంగంలోకి దిగి షాబాద్ ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో చాక్యచక్యంగా వ్యహరించి సీసీ కెమరాలను పరిశీలించారు. అనంతరం వ్యక్తి దొంగతనంకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది.
దగ్గరలోని మరో సీసీ కెమెరాలను ముందుగానే కట్ చేశాడు. దూరంగా ఉన్న పోలీస్‌లు ఏర్పాటు చేసిన కెమెరాలను పరిశీలించక పోవడంతో సీసీ కెమెరాల్లో మహేందర్ అని పోలీసులు తేల్చారు. సీసీ కెమరాలు ఉండటంతో దొంగలను పట్టుకోవాడానికి సులభంగా ఉందని వివరించారు. దొంగతనానికి పాల్పడిన మహేందర్‌ను రిమాండ్‌కు తరలించారు. నగదును కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కేసులో చాక్యచక్యంగా వ్యహరించిన ఎస్సై రవికుమార్‌ను, ముగ్గురు కానిస్టేబుల్స్‌ను నగదు పారితోషకం ఇచ్చి అభినందించారు.