హైదరాబాద్

బల్దియాకు మరో అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: మహానగరవాసులకు పౌరసేవల నిర్వహణ, అభివృద్ధి పనులను అందించే జీహెచ్‌ఎంసీని మరో అరుదైన అవార్డు వరించింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను కైవసం చేసుకున్న జీహెచ్‌ఎంసీకి ఇపుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేసే ప్రతిష్టాత్మకమైన ఎక్స్‌లెన్సీ అవార్డు 2018ను దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ శాఖలకు చెందిన 13 మంది అధికారులకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించగా, అందులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు అతి తక్కువ సమయంలో విజయవంతంగా భూ సేకరణను పూర్తి చేయటంలో బల్దియా చేసిన కృషికి ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు ప్రభుత్వం శనివారం ఆదేశాల్లో పేర్కొంది. హైదరాబాద్ నగరాన్ని మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా రూ. 8వేల 598.58 కోట్ల వ్యయంతో లక్ష నిర్మాణాలు ముమ్మురంగా సాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 109 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లలో రెండు బాత్ రూంలు, ఒక కిచెన్, హాల్‌తో వీటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో మరెక్కడ లేని విధంగా ఏకంగా 41 బస్తీల్లో నివాసితులను ఖాళీ చేయించి, వారికి అక్కడే ఇన్‌సిటూ పద్దతిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించటంలో జీహెచ్‌ఎంసీ అనుసరించిన వ్యూహాం ఫలించి, విజయం సాధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు చేసిన కృషిని అభినందిస్తూ, భూ సేకరణకు అనుసరించిన విధానాలను ప్రశంసిస్తూ ఈ ఎక్స్‌లెన్సీ అవార్డులను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ వివరించింది. ఇదే డబుల్ బెడ్ రూం స్కీం అమలు తీరుకు సంబంధించి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇప్పటికే కమిషనర్ ప్రదాని నరేంద్రమోది చేతుల మీదుగా స్వీకరించిన సంగతి తెలిసిందే! దీంతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల హాడ్కో అవార్డును కూడా జీహెచ్‌ఎంసీ స్వీకరించిన విషయం విధితమే.