హైదరాబాద్

మ్యాన్‌హోళ్లు సరిలేక ప్రమాదం జరిగితే.. అధికారులపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: వర్షాకాలంలో ఎక్కడైనా మ్యాన్‌హోళ్ల వద్ద ప్రమాదాలు జరిగితే, అందుకు సంబంధిత జలమండలి మేనేజర్‌ను బాధ్యుడ్ని చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జలమండలి ఎండీ దాన కిషోర్ హెచ్చరించారు. అధికారులు తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికపుడు, ఏ మాత్రం జాప్యం చేయకుండా పరిష్కరించాలని కూడా ఆయన సూచించారు. శనివారం సాయంత్రం బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ ‘మీట్ యువర్ ఎండీ’, డయల్ యువర్ ఎండీ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలను తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మల్లాపూర్, బల్కంపేట, ఇందిరానగర్, యూసుఫ్‌గూడ, మూసాపేట, రామ్‌నగర్, ప్రాంతాల నుంచి కలుషిత నీరు, అరకొర సరఫరా, లో ప్రెషర్ వంటి సమస్యలున్నట్లు 9 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అంతకు ముందు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ అధికారులతో ఎండీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆరు అడుగులు, అంతకంటే ఎక్కువ లోతు ఉన్న సుమారు 11వేల 601 మ్యాన్‌హోళ్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే 3591 మ్యాన్‌హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన మరో 8వేల మ్యాన్‌హోళ్లకు ఈ నెలాఖరు కల్లా గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలో ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలోని మసీదులు, ప్రార్థన మందిరాల వద్దనున్న మ్యాన్ హోళ్లు ఉప్పొంగి ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోర్డు రెవెన్యూ పెంచేందుకు అధికారులు చక్కటి సమన్వయంతో కృషి చేయాలన్నారు. దీర్ఘకాలకంగా నీటి బిల్లులు చెల్లించని వారిని గుర్తించి, వారి నల్లా కనెక్షన్లను కట్ చేయాలని, అవసరమైన వారికి జరిమానాలు విధించాలని సూచించారు. వర్షాలు కురిస్తే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో జలమండలి అత్యవసర బృందాలు సిద్దమవుతున్నాయని, ఇవన్నీ వచ్చే నెల మొదటి వారంలో రంగంలోకి దిగనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్-1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ బి.విజయ్‌కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ ఇతర విభాగాలకు చెందిన సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.

నకిలీ అనుమతులతో నిర్మాణాలా?
బోడుప్పల్‌లో కాలనీ సంక్షేమ సంఘాల ర్యాలీ
ఉప్పల్, మే 19: బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలో నకిలీ అనుమతులతో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిపై చర్యలు తీసుకోకుండా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటే అధికార పార్టీ నేతలే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. నకిలీ అనుమతుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండగా అధికార పార్టీ నేతలు, అధికారుల జేబులు నిండుతున్నాయని ఆరోపించారు. తక్షణమే స్పందించి అవినీతిని అరికట్టి ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో సమాఖ్య నేతలు వి.అశోక్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బి.కృష్ణా రెడ్డి, చిత్తరంజన్, రామచంద్రయ్య, చంద్రశేఖర్, కృష్ణ, టి.నర్సింహ, ఎస్‌వి శాస్ర్తి, పిఎన్ రావు, రామాచారి పాల్గొన్నారు.

అన్నదాతలను ఆదుకునేందుకు కృషి
షాబాద్, మే 19: రైతు కష్టాలను తప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ, షాబాద్, మల్లారెడ్డిగూడ గ్రామాల్లో ఎంపీ విశేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సభ్యులు లక్ష్మీరెడ్డి, జేసీ హరిష్ కుమార్‌తో కలిసి రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలు, పెట్టుబడి చెక్కులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన కేసీఆర్ రైతుల కష్టాలు తీర్చేందుకు రైతుబంధు పథకం ప్రారంభించారని వివరించారు. ఎంపీ విశే్వశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో రైతులకు అవసరమైన అన్ని రకాలుగా ఆదుకుంటుందని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి రవికుమార్, జడ్పీటీసీ లక్ష్మీ, సింగిల్‌విండో చైర్మెన్ అవినాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటయ్య, మండల రైతు స్వమన్వ కమిటీ అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారిణి పద్మావతి, వ్యవసాయ అధికారిణి సంయుక్త, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.