హైదరాబాద్

కుంటుంబ కథా చిత్రాలను నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కుంటుంబ కథా చిత్రాలను నిర్మించాలని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సూచించారు. కళారాజ్ సంస్థ ఆధ్వర్యంలో ‘షార్ట్ ఫిలిం అవార్డ్సు 2018’ ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రమణ ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శక, నిర్మాతలకు అవార్డులను ప్రదానం చేశారు. నేటి తరంలో వస్తున్న చిత్రల ద్వారా యువత పెడదోవ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుంటుంబ కథా చిత్రాలను నిర్మించి సమాజానికి మంచి సందేశాన్నివ్వాలని చెప్పారు. చిన్న నిర్మాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస రావు, సంస్థ అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సాయిబాబాకు పురస్కారం ప్రదానం
కాచిగూడ, మే 20: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పీవీ సాయిబాబాకు ‘చిత్తరంజన్ లలిత సంగీత పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం నాగరంజని లలిత సంగీత అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఆకాశవాణి డిప్యూటీ జనరల్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ పాల్గొని సాయిబాబాకు పురస్కారం ప్రదానం చేశారు. లలిత సంగీత మధుర గాయనీ విజయలక్ష్మీ అలపించిన ‘సంగీత మణిమంజరి’ ఆడియో సీడీని ఆవిష్కరించారు. పురస్కారాలతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. చిత్తరంజన్ వైబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు అమృతవల్లి నిర్వహణలో గాయకులు అలపించిన లలిత సంగీతం అందరినీ అలరించాయి. కార్యక్రమంలో రాజారావు త్రిపురనేని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఎం.చిత్తరంజన్, ఆనంద కౌశిక్ పాల్గొన్నారు.