హైదరాబాద్

గడువు దాటితే జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. నిన్నమొన్నటి వరకు వర్తమాన ఆర్థిక సంవత్సరం (2018-19) ఆస్తి పన్నును ముందస్తుగా వసూలు చేసుకునేందుకు ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేసి రూ.437 కోట్లను వసూలు చేసుకున్న జీహెచ్‌ఎంసీ ఇపుడు ట్రేడ్ లైసెన్సులపై దృష్టి పెట్టింది. మహానగరంలోని వ్యాపార సంస్థలకు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ట్రేడ్ లైసెన్సులను ఈ నెల 30వ తేదీలోపు రెన్యువల్ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి సూచించారు. లేనిపక్షంలో 31వ తేదీ నుంచి రెన్యువల్ చేసుకుని లైసెన్సుల నుంచి 50 శాతం పెనాల్టీ వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వ్యాపారస్తులు తమ ట్రేడ్ లైసెన్సులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా ఫీజులను చెల్లించి ప్రొవిజనల్ ట్రేడ్ లైసెన్సులను పొందవచ్చునని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్సుల్లేని, పొందని వ్యాపార సంస్థలు కొత్తగా ఆన్‌లైన్ ద్వారాగానీ, ఈ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో, జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో కూడా పొందవచ్చునని సూచించారు. మరిన్ని వివరాలకు జీహెచ్‌ఎంసీ ఆఫీసును, వెబ్‌సైట్‌నుగాని సందర్శించవచ్చునని కమిషనర్ తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు
*ఎంపీ మల్లారెడ్డి

కేపీహెచ్‌బీకాలనీ, మే 20 : ప్రతి కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నేరాలను అదుపు చేయవచ్చని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రైన్‌బోవిస్టా అపార్టుమెంట్‌లో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్ పన్నాల కావ్య హరీష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి సీఐ ప్రసన్న కుమార్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు హేమంత్, కోశాధికారి రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు కులదీప్, శంకర్ రెడ్డి, తుషార్, సరళ, భాగ్య, తోట రమేష్, సూరి పాల్గొన్నారు.