హైదరాబాద్

సిటీ 41 డిగ్రీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంపై ప్రచండ భానుడి ప్రతాపం మళ్లీ పెరిగింది. కొద్ది రోజుల క్రితం వరకు కమ్యులోనింబస్ మేఘాలు, ఉపరితల ద్రోణీ కారణంగా నగరంలో భారీగా వర్షాలు కురిసి చల్లబడ్డ వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్లీ వేడెక్కింది. తెల్లవారుఝాము 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ, మధ్యాహ్నాం పనె్నండు గంటల కల్లా 37 డిగ్రీలు, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల కల్లా 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగటానికి తోడు వడగాలుల తీవ్రత కూడా పెరగటంతో ఉదయం పదకొండు గంటల తర్వాత మధ్యాహ్నం మూడు, నాలుగు గంటల మధ్య నగరవాసులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినా, వేడి, ఉక్కపోత తగ్గటం లేదు. అర్థరాత్రి సైతం వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు ఉన్నా, ఇంట్లో వాతావరణం చల్లబడటం లేదని కొందరు నగరవాసులు వాపోతున్నారు. వేడిమి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లటి శీతలపానీయాలను ఆశ్రయించటంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఉష్ణోగ్రతల పెరుగుదల, వడగాలులు తీవ్రత మరో మూడు రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశమున్నట్లు నగరంలోని వాతావరణ శాఖ వెల్లడించింది. పైగా 1వ తేదీ తర్వాత ఎలాగో తగ్గుముఖం పట్టే ఉష్ణోగ్రతలు ఈ రానున్న వారం రోజుల్లో మరింత రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి. మిట్ట మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప, బయటకు రావద్దని పర్యావరణ నిపుణులు, వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.
మండుటెండల భగభగలు
తాండూరు: తాండూరు డివిజన్‌లో నానాటికి ఉధృతమవుతున్న మండు టెండల భగ భగలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. మధ్య మధ్యలో ఈదురు గాలులు, అకాల వర్షాలు కురుస్తున్నా మండుటెండలతో జనం ఉక్కబోతలతో ఉసురు మంటున్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పగలంతా ఎండల భగ భగలు సాయంత్రానికి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన చిన్నపాటి వర్షాలు కురుస్తూ సాయంత్రం వేళల్లో వాతావరణం కొంత చల్ల బడినా మరుసటి రోజు ఉదయం నుంచే ఎండల తీవ్రత ఊపందుకుంటుంది. నేలాఖరు కావస్తున్నా.. తాండూరు ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. దాంతో వ్యాపారులు, రోడ్లపై దందాలు నిర్వహించే చిరు వ్యాపారులు, పాదచారులు ఎండవేడిమికి తట్టుకోలేక పోతున్నారు. తాండూరు డివిజన్‌లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం, వాయుకాలుష్యం, దుమ్ము ధూళీతో పట్టణ పరిసరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దానికి తోడు మండుతున్న ఎండల తాకిడికి తాండూరు ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గరయి ఆస్పత్రుల పాలవుతున్నారు. మండు వేసవి తాపంతో ప్రతి ఇంటా వృద్ధులు, చిన్నారులు,పసి పిల్లలు శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ పాలవుతున్నారు. మండు వేసవిలో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రుల వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా ఎండా కాలం తాండూరు డివిజన్‌లో ఎండల తీవ్రతలు అధికంగా ఉంటాయని అందుకు కారణం ఈ ప్రాంతంలో అటవీ సంపద కరువై, చెట్లు చెమలు తగినంతగా లేక పోవటం, తాండూరు డివిజన్ పరిసరాల్లో భూగర్భంలో నాపరాతి నిల్వలు,నాపరాతి బండలు పరుచుకొని ఉండటం మూలంగానే ఈ ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణలు పేర్కొంటున్నారు. మేలాఖరు జూన్‌లో వర్షాలు కురిసే సమయం సమీపిస్తున్నప్పటికీ ప్రచండ భానుడి ప్రతాపం మాత్రం తగ్గటం లేదని ప్రజలు వాపోతున్నారు. భగ్గు మంటున్న ఎండలతో ఈప్రాంతంలో భూగర్భ జాలాలు అడుగంటి పోయి నీటి కాలుష్యం కోరలు చాస్తుంది. కాలుష్యంతో కూడిన నీటిని తాగుతున్న జనాలు రోగాల పాలవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.