హైదరాబాద్

సమ్మె బాటలో ఎస్‌ఎఫ్‌ఏలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తున్న శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లకు అధికారులు స్థానం చలనం కలిగించటాన్ని నిరసిస్తూ ఔట్‌సోర్సు ఉద్యోగులు తమ ఆందోళను ఉద్దృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ బదిలీల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలోని మొత్తం 936 మంది శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ దఫా మజ్లిస్ ఎమ్మెల్యేలను కలిసి మద్దతను కూడగట్టుకున్న ఎస్‌ఎఫ్‌ఏలు తాజాగా మజ్లీస్ అధినేత అసదుద్దిన్ ఓవైసీని కూడా కలిసి, ఆ తర్వాత సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. తమ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేటపుడు ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకే బదిలీలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేయగా, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లతో తమకు సత్సంబంధాలుంటే పారిశుద్య పనులు మరింత మెరుగ్గా జరుగుతాయని, ఈ క్రమంలో తామెందుకు వారిని బదిలీ చేయమంటామని కొందరు ప్రజాప్రతినిధులు వ్యాఖానిస్తున్నారు. అక్రమార్కులైన కొందరు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు.. శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లను తమ అక్రమార్జనకు సూత్రధారులుగా, వారికిష్టమున్నా, లేకపోయినా బలవంతంగా వారి సేవలను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించే అధికారులు వీరి బదిలీలను చేపట్టినట్లు వాదనలున్నాయి. కానీ, తామేమీ కార్పొరేషన్ పర్మినెంట్ ఉద్యోగులమా? తమకేమైనా పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా వేలలో జీతాలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారా? తమ జీతం కేవలం రూ.15వేలు, అందులో మెడికల్ ఆఫీసుర్లు సుమారు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ప్రతి నెల జరిమానాలుగా కోతలు విధిస్తున్నారని కొందరు ఎస్‌ఎఫ్‌ఏలు వాపోతున్నారు. తమ సేవలను మెడికల్ ఆఫీసర్లు కేవలం కార్పొరేషన్, కార్యాలయానికే పరిమితం చేయకుండా తమ ఇళ్లలో కూడా పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
బదిలీ ఉత్తర్వులు అమలవుతున్నాయా?
నగరంలోని 936 మంది శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లను బదిలీ చేస్తున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్‌ఎఫ్‌ఏల్లో మహిళలకు ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిల్‌లోనే మరో ప్రాంతానికి, ఇక పురుషుకైతే ఏకంగా సర్కిల్ నుంచి సర్కిల్‌కు ఎంతో పారదర్శకంగా బదిలీ చేశామని అధికారులు చెప్పుకుంటుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం ఎస్‌ఎఫ్‌ఏలు మంచి అవగాహనతో విధులు నిర్వర్తించుకుంటున్నారు. బదిలీ అయిన వారు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ బదిలీలకు ముందు తాము విధులు నిర్వర్తించిన ప్రాంతాల్లోనే పనులు చేసుకుంటున్నట్లు, ఇందుకు కొందరు మెడికల్ ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణులు ఉన్నాయి.