హైదరాబాద్

భయం వద్దు..నేనున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు ఏ మాత్రం అధైర్యపడొద్దని..పార్టీని బతికించుకుని, పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తానున్నానంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లోనే టీడీపీ పార్టీ కీలకంగా మారనుందని బాబు చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. తిరుగులేని శక్తిగా టీడీపీ ఎదుగుతోందని కార్యకర్తల్లో నమ్మకాన్ని నింపారు. నిన్నమొన్నటి వరకు నగరానికి చెందిన పలువురు తెలుగు తమ్ముళ్లు కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ లాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ చక్రం తిప్పుందన్న వాదనలకు బాబు ప్రసంగం బలాన్ని చేకూర్చింది. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ టీడీపీ మహానాడు సభకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉదయం పది గంటలకే మహానాడు సభ ప్రారంభమైన్పటి నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ప్రధాన వేదికపైకి చేరుకునే సమయానికి మహానాడుకు హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తల సంఖ్య రెండింతలైంది. బాబుతో సెల్ఫీలు దిగేందుకు, ఆయనకు కండువా వేసేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు. ఎండలను సైతం లెక్క చేయకుండా, మహిళలు, వృద్దులు, యువతులు సైతం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చారు. అప్పటి వరకు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల ప్రసంగాలు కొనసాగిన సభలో బాబు రాకతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. బాబు ప్రధాన వేదిక వద్దకు చేరుకోగానే, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జై తెలుగుదేశం..చంద్రబాబు జిందాబాద్ అంటూ చేసిన నినాదాలతో సభస్థలి దద్దరిల్లింది.