హైదరాబాద్

మెట్రోరైల్ రెండో దశపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన మెట్రోరైలు మొదటి దశ పనులు వేగంగా సాగుతున్నాయి. మరికొన్ని రద్దీ, ట్రాఫిక్ ప్రాంతాలను కలుపుతూ రెండో దశగా ఎంతో ముందుచూపుతో మెట్రోరైలు ప్రాజెక్టు ఏర్పాటుకు గత కొద్దిరోజులుగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌కు చెందిన అధికారులు, నిపుణుల బృందం గడిచిన మూడు నెలల నుంచి నగరంలోని వివధ ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్ర స్థాయిలో మెట్రోరైలు అవశ్యకత, ఫీజుబిలిటీ, ఏర్పాటుకున్న అవకాశాలు, ఏర్పాటు చేస్తే ఎంతవరకు సద్వినియోగమవుతుందన్న విషయాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం కూడా హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలో నిపుణులు, అధికారుల బృందం ఇప్పటికే మెట్రోరైలు రెండో దశను ప్రారంభించిన ప్రాంతాల్లో పర్యటించింది. ఆ తర్వాత హైదరాబాద్, దిల్లీ మెట్రోరైలు అధికారుల బృందం, నిపుణులు కూడా రెండో దశ మెట్రోపై మేధోమథనం నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పటికే నగరంలో 72కిలోమీటర్ల పొడువును మూడు కారిడార్లుగా ఏర్పాటవుతున్న మెట్రోరైలు కారిడార్‌లు కాకండా, ప్రతాయ్నాయంగా మెట్రోరైలు వంటి ఆధునిక రవాణా వ్యవస్థ అవసరమైన, ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాలపై ఈ బృందం క్షేత్ర స్థాయి కసరత్తును నిర్వహిస్తోంది. ప్రాధాన్యతపరంగా ప్రభుత్వం మెట్రోరైలు రెండో దశకు సూచించిన ప్రాంతాలపై ఈ బృందం కసరత్తు చేస్తోంది. మెట్రోరైలు ఎండీతో పాటు దిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీ మంగుసింగ్, ఇతర నిపుణులతో కూడిన ఈ బృందం కసరత్తులో భాగంగా దిల్లీ, హైదరాబాద్ మెట్రో అధికారులు పరస్పరం తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెట్రోరైలు నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఇంజనీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు వాహనరాకపోకలు ఎలాంటి అడ్డంకుల్లేకుండా వీలైనంత ఎక్కువగా, వేగంగా సాగేందుకు వీలుగా ప్రతిపాదనల తయార్లో ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. వినియోగించాల్సిన టెక్నాలజీ, ఏఏ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది, ఈ ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయం ఎంత? అన్న అంశాల ప్రాతిపదికన రూపొందించే ఈ ప్రతిపాదనలకు వచ్చే నెల చివరికల్లా తుది రూపు వస్తోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో దిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.డి.శర్మ, హైదరాబాద్ మెట్రోరైలు చీఫ్ ఇంజనీర్ పంచం, ఎలక్ట్రికల్ విభాగం చీఫ్ ఇంజనీర్ డీవీఎస్.రాజు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన కె.లక్ష్మణ్, మేనేజర్ బి.ఆనంద్, వర్క్స్ జీఎం విష్ణువర్దన్ రెడ్డి, ఎస్‌ఈ ఆనంద్‌మోహన్, బీ.ఎన్.రాజేశ్వర్ తదితరులున్నారు.