హైదరాబాద్

రైళ్లు కిటకిట.. ప్రయాణికుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: వేసవి సెలవులు కావడంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సెలవుల కారణంగా ఇతర ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలివెళ్లే ప్రయాణీకులతో దాదాపు అన్ని రైళ్లు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా సెలవులను గడపడానికి ప్రజలు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. నెల రోజుల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికి అవి ఎంతమాత్రం ప్రయాణీకుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. రెగ్యులర్ రైళ్లకు సంబంధించి రిజర్వేషన్లు 90 రోజుల ముందే రిజర్వు చేసుకునే అవకాశం ఉండడంతో పక్కా ప్రణాళికతో ముందుగానే రిజర్వు చేయించుకున్నవారు తప్ప కొంత ఆలస్యంగా రిజర్వేషన్‌కు ప్రయత్నించిన వారికి, అప్పటికప్పుడు ప్రయాణం చేయాల్సి వచ్చినవారికి రిజర్వేషన్లు దొరక్కపోవడంతో వెయిటింగ్ పెరిగిపోయింది. తాము ప్రయాణించాల్సిన రోజు వచ్చినప్పటికి వెయిటింగ్ లిస్టు ఎంతమాత్రం ముందుకు వెళ్లకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వుడు అన్‌రిజర్వుడు బోగీల్లో ప్రయాణం సాగిస్తున్నారు. ముందే ఎండాకాలం కిక్కిరిసిన ప్రయాణంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు వెళుతున్నారు. పండుగలు, ఉత్సవాలు, వేసవి సెలవుల రోజుల్లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు పసిగట్టి సాధ్యమైనన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నా అవి ప్రయాణీకుల అవసరాలను ఎంతమాత్రం తీర్చడం లేదు. ఇప్పటివరకు దాదాపు 175 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటుచేశారు. రెగ్యులర్‌గా నడిచే రైళ్లకు సాధ్యమైనన్ని అదనపు బోగీలను ఏర్పాటు చేయడంతోపాటు రద్దీగా ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
అయినప్పటికి నానాటికి పెరుగుతున్న రైల్వే ప్రయాణీకుల అవసరాలను అవి ఎంతమాత్రం తీర్చకపోవడంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాలం చెల్లిన పట్టాలు, రైల్వేబోగీలతో కాలం వెల్లదీస్తున్న రైల్వేశాఖకు కొత్త లైన్ల ఏర్పాటు, బోగీల కొరత కూడ వేధిస్తుంది. ప్రతిసారి బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉన్నప్పటికి అవి ఆచరణలో తూతూమంత్రంగా అమలు అవుతున్న కారణంగా ఆశించిన మేర రైల్వే అభివృద్ధి జరగడం లేదనడంలో సందేహం లేదు. ఖాళీల భర్తీలో జాప్యం, ఉన్నవారిపైన అదనపుపనిభారం, అదే సమయంలో ఉన్న రైల్వేలైన్లపైనే అదనపుభారంతో కాలం వెల్లదీయడం, కొత్తగా సాధించిన ప్రగతి ఏమిలేకుండా పోయింది. గత దశాబ్దకాలంగా రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు ప్రకటించిన ప్రాజెక్టులు చాలా వరకు అటకెక్కాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. ఇప్పటికైనా కేంద్రం రైల్వేశాఖను బలోపేతం చేయడంతోపాటు అతిపెద్ద ప్రజారవాణా సంస్థ రైల్వేలను ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణీకులు కోరుతున్నారు.