హైదరాబాద్

మా ప్రాంతాల్లో అత్యాచారాలు జరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సమాజంలోని ప్రతి ఒక్కరూ మా ప్రాంతంలో చిన్నపిల్లలు, మహిళలపై అత్యాచారాలు జరగవు అంటూ స్వచ్ఛందంగా ప్రకటించుకున్నపుడే భద్రత అనే భావనపై విశ్వాసం పెరుగుతోందని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి , జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ వెంకటకృష్ణయ్య సూచించారు. బాలిక సంరక్షణపై శనివారం నగరంలో నిర్వహించిన ఒక రోజు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గర్భస్తశిశువు లింగ నిర్దారణ పరీక్షల నిరోధక చట్టం, బాలలపై జరిగే అత్యాచార నిరోధక చట్టం(్ఫక్సో) నిబంధన గురించి జిల్లాలోని స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు, విద్యాశాఖ సీఆర్‌పీలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, తహసిల్దార్లకు వివరించాగరు. జిల్లా కలెక్టర్ యోగితారాణా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో క్యాప్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నళిని గంగాధరన్, యూనిసెఫ్ మాజీ సలహాదారు డేవీడ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ బాస్కరచారి, జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీఎంహెచ్‌ఓ డా.పద్మజ, డీఈవో వెంకటనర్సమ్మ, ఆర్టీఓ చంద్రకళ తదితరులు ప్రసంగించిన ఈ సదస్సులో జడ్జి మాట్లాడుతూ పిల్లలకు, మహిళలకు పూర్తి భద్రత కలిగిన ప్రాంతంగా హైదరాబాద్ జిల్లాను తీర్చిదిద్దే ప్రక్రియలో క్షేత్ర స్థాయిలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు.
ఫోక్సో చట్టం ప్రకారం బాధిత పిల్లలకు పూర్తి భద్రత కల్పించటంతో పాటు విచారణ రహస్యంగా జరుగుతుందని తెలిపారు. సాక్ష్యాల సేకరణ ప్రక్రియ కూడా శాస్ర్తింగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కేసులకు సంబంధించి సెషన్స్ కోర్టులో ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని, మధ్యంతర ఉపశమనంగా బాధితులకు రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిరు. కేసులు విచారణ, సూచనలు, సలహాలకై లీగల్ సర్వీసెస్ అథారిటీ సూపరింటెండెంట్ సెల్‌ఫోన్ 7842756974 లో గానీ లేక ఫోన్ 9440621459లో తనను నేరుగా సంప్రదించవచ్చునని జడ్జి సూచించారు.
కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ మన దేశంలో ప్రతి నలుగురిలో ఒక మహిళ, బాలిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిపిరు. ఆడ పిల్లలు పుట్టకముందే వారిని చంపరాదన్న విషయాన్ని ఇంటింటికి ప్రచారం చేయాలని, పిల్లల పెంపకంలో వివక్ష తగదన్న విషయంపై కూడా తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరముందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

ఘన వ్యర్థాల నియంత్రణపై
ఇండోర్‌లో మేయర్ బృందం అధ్యయనం

హైదరాబాద్, మే 26: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో ‘స్వచ్ఛత’లో మొదటి స్థానం దక్కించుకున్న ఇండోర్ సిటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులతో కూడిన బృందం అధ్యయనం చేస్తోంది. మేయర్, కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్‌లు ముషారప్, రవికిరణ్ తదితరులతో కూడిన బృందం శనివారం ఇండోర్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఇండోర్ సిటీ ఘన వ్యర్థాల నియంత్రణలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాల గుర్తించి తెల్సుకున్నారు. ముఖ్యంగా నందనగర్‌లో మేయర్ బృందం, స్థానిక ఇండోర్ అధికారులు అక్కడి స్థానికులతో నేరుగా కలిసి మాట్లాడారు. చెత్తను తడి,పొడిగా ఎలా విడదీస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చెత్తను ఒక చోట నుంచి మరో చోటకు తరలించే ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను మేయర్ బృందం సందర్శించింది. ఈ నగరంలో నూటికి నూరు శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ పక్కాగా జరుగుతున్నట్లు మేయర్ బృందం గుర్తించింది. అంతేగాక, ఇంటి నుంచి చెత్తను ఇచ్చే ముందే ఇంట్లోని కుటుంబ సభ్యులే తడి,పొడి చెత్తను వేర్వురు చేసి నూటికి నూరు శాతం ఇస్తున్నట్లు మేయర్ బృందం గుర్తించింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో పోగయ్యే చెత్తను ఇంటి వారే తడి,పొడిగా వేర్వేరు చేసి ఇవ్వాలన్న అంశంపై ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ప్రాతిపదికన ఇండోర్ సిటీ ఎంతో విజయవంతంగా అక్కడి ప్రజలను అవగాహన వంతులను చేయగలిగింది. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయటంతో పాటు భవన నిర్మాణ వ్యవర్థాలను తిరిగి వినియోగించేలా ప్లాంట్లను ఏర్పాటు చేసి, చాలా మెరుగైన విధానంలో నిర్వహణ చేపడుతున్నట్లు గుర్తించారు. పారిశుద్య నిర్వాహణ, నిబంధనలను కఠినతరంగా అమలు చేసేందుకు ఇండోర్ స్థానిక సంస్థ ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అంతేగాక, కార్పొరేషన్‌కు చెందిన అన్ని విభాగాల, అన్ని రకాల కార్యకలాపాలను ఐటీతో అనుసంధానం చేసింది.ఈ సందర్భంగా ఇండోర్ అధికారులతో మేయర్ బృందం రెండు గంటల పాటు సమావేశమైంది. ఇందులో అధికారులు రోజువారీ పారిశుద్ద్య కార్యక్రమాలు, ఇతర పౌర సేవల నిర్వహణ గురించి ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.