హైదరాబాద్

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, మార్చి 31: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కొత్తమోడల్స్ ద్విచక్ర వాహానాలు సందడి చేస్తున్నాయని, వీటిని కొనేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. గురువారం సాయినగర్ చౌరస్తాలోని హీరో బైక్‌షోరూంలో ఏర్పాటు చేసిన హీరోమెస్ట్రో ఎడ్జ్ 110 సిసి ద్విచక్ర వాహనాన్ని మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కొత్త వాహనాల మోజులో యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించటం లేదని అన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హెల్మెట్ దరించాలని ఆయన పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ప్రాంతం రోజు రోజుకు కొత్తదనం సంతరించు కుంటుందని అన్నారు. ఇక్కడ ఎన్నో షోరూంలు వెలుస్తున్నాయని మేయర్ అభినందించారు. సాయినగర్‌లో శిఖారి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హీరో బైక్ షోరూం అందరినీ ఆకట్టుకోవటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ కార్పొరేటర్లు శిరిషా జితేందర్‌రెడ్డి, ఎన్.జగదీష్ గౌడ్, ఆకుల నర్సింగరావు, పరుశరామ్‌రెడ్డి, నిర్వాహకులు శిఖారి కృష్ణయాదవ్, వేణుకుమార్ యాదవ్, నవీన్, రాము యాదవ్, టిఆర్‌ఎస్ నాయకులు ఉపేందర్, సిద్ధిరాములు పాల్గొన్నారు.