క్రైమ్/లీగల్

స్కూల్ వ్యాన్ కింద పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 14: స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ళ విద్యార్థి మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని నారాయణ పాఠశాలలో రామయ్యగూడకు చెందిన పాపయ్య, లక్ష్మిల కొడుకు సాయి విఘ్నేష్(4) చదువుతున్నాడు. గురువారం సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వ్యాన్‌లో వెళ్ళి స్టేజి వద్ద దిగాడు. వ్యాన్ దిగి బ్యాగు తీసుకుంటుండగా డ్రైవర్ వ్యాన్ విద్యార్థి పై నుంచి పోనివ్వడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవరావు ఆసుపత్రికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటనపై స్పందించిన సీఐ వెంకటరామయ్య ఫిట్నెస్ లేని బస్సులు, వ్యాన్‌లు నడిపినా, లైసెన్స్‌లు లేని డ్రైవర్లున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.