హైదరాబాద్

వరదనీటి పైప్‌లైన్ పనులపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్ : సనత్‌నగర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వరదనీటి పైప్‌లైన్ పనులపై స్ధానిక ప్రజల్లో తీవ్ర భయందోళనలు నెలకొన్నాయి. డివిజన్ పరిధిలోని అయ్యంగార్ బేకరీ నుంచి తులసీనగర్ వరకు సూమారు రూ 40 లక్షల వ్యయంతో వరద నీటి పైప్‌లైన్ పనులు కొనసాగుతున్నాయి. భూగర్భం గుండా కొనసాగుతున్న ఈ పనుల్లో మంచినీటి పైప్‌లైన్లు అనుసంధానంగా జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రజలు భవిష్యతులో మంచి నీరు కలుషితం అయ్యే అవాకాశం ఉందని వివరించినా పనులు నిర్వహిస్తున్నారు. చివరకు మహానగర నీటి పారుదల శాఖ ఇంజనీర్లు సైతం సరైన ప్రణాళిక లేకుండా జరుగుతున్న ఈ పనుల వల్ల నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించినా జిహెచ్‌ఎంసి పనులను ఏకపక్షంగా చేపడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయ. ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రమోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల ఇలాగే కొనసాగితే ఉదయ్‌నగర్, నెహ్రునగర్, రాజరాజేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉన్నందున ఉన్నతాధికారులు స్పందించి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.