హైదరాబాద్

ముసుగు తొలిగేది ఎన్నడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ముసుగులతో దర్శనమిస్తున్న మహానీయుల విగ్రహాల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా అధికారులు ముందుకు రాకపోవటం గమనార్హం. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎంట్రెన్స్‌లో దర్శనమిస్తున్న విగ్రహాలు సుమారు ఎనిమిదేళ్ల నుంచి అలాగే దర్శనమిస్తున్నాయి. ఈ విగ్రహాల వివాదాన్ని పరిష్కరించి, మహనీయుల విగ్రహాలను ప్రధాన కార్యాలయంలోనే సరైన ప్రాంతాల్లో ప్రతిష్టించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు ఇటీవలే నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేసినా, అధికారులు వాటిని కూడా బుట్టదాఖలు చేశారు. నగరం గ్రేటర్‌గా రూపాంతరం సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ తరపున అప్పటి మేయర్ బండకార్తీకచంద్రారెడ్డి, కార్పొరేటర్లు అప్పట్లో స్థారుూ సంఘంలో తీర్మానం చేసి 2010 చివర్లో ప్రతిష్టించారు. వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆయనతో పాటు మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్, జ్యోతిరావుపూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న టీడీపీ అభ్యర్థనను అప్పటి పాలక మండలి పట్టించుకోలేదు. దీంతో అప్పటి టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు వైఎస్ విగ్రహానికి ఇరువైపులా రాత్రికి రాత్రే గాంధీ, అంబేద్కర్ విగ్రహలను ప్రతిష్టించి సంచలనాన్ని సృష్టించింది. అప్పట్లో తీవ్ర దుమారం రేపిన ఈ విగ్రహాల వివాదంలో భద్రతా పరంగా సెక్యూరిటీ విఫలమైందంటూ అప్పట్లో అధికారులు సెక్యూరిటీపై చర్యలు కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి కొన‘సాగు’తున్న ఈ వివాదం నేటికీ పరిష్కారం కాలేదు. పైగా ప్రతిష్టించిన విగ్రహాలకు ముసుగులు వదిలేశారు. అయితే వైఎస్ కాళ్ల వద్ద గాంధీ, అంబేద్కర్‌ల విగ్రహాలను ప్రతిష్టించారంటూ ఎస్సీ ఉద్యోగులు గతంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విగ్రహాల జోలికెళితే ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయం పాలక మండలితో పాటు అధికారులను సైతం వెంటాడుతోంది. ప్రతిష్టించిన మహనీయుల విగ్రహాలను తొలగించేందుకు అధికారులు గతంలో ప్రయత్నాలు చేసినా, ప్రస్తుతం ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడటం లేదు. జాగ్రత్త వహించాలన్నదే అధికారుల ప్రధాన ఆలోచన. వైఎస్ విగ్రహాన్ని ప్రస్తుతం ప్రతిష్టించిన చోటే ప్రారంభించి, మిగిలిన రెండు విగ్రహాలను గ్రేటర్ ప్రధాన కార్యాలయంలోనే వేర్వేరు చోట ప్రతిష్టించాలని అధికారులు, పాలక మండలి సభ్యులు భావించినా, అభ్యంతరాలెన్నో ఎదురవటంతో ఈ విషయాన్ని పక్కనబెట్టారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహల సంగతేంటో తేల్చాకే, వైఎస్ విగ్రహాన్ని ప్రారంభించాలని ఎస్సీ ఉద్యోగ సంఘాలు, విపక్షాలు భీష్మించుకున్నాయి. ఈ క్రమంలో ఆ సంఘం సభ్యులు ఇప్పటికే పలు సార్లు సమర్పించిన వినతిపత్రాలు కూడా బుట్టదాఖలయ్యాయి. స్వరాష్ట్రం, స్వపరిపాలనలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి బల్దియా పాలక మండలి ఇప్పటికైనా ఈ వివాదాన్ని పరిష్కరించి, మహానీయుల విగ్రహాలను వేర్వేరు చేట ప్రతిష్టించి, వాటికి గౌరవం దక్కేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ విన్పిస్తోంది. ఈ విగ్రహాల్లో ఒకదాన్ని బూర్గుల రామకృష్ణారావు భవనం పక్కనే ఉన్న మెయిన్‌గేటుకు సమీపంలో, మరోదాన్ని పార్కింగ్ పక్కనే ఉన్న పార్కులో ప్రతిష్టించాలని గతంలో అధికారులకు ఎన్నో ప్రతిపాదనలు అందాయి. కానీ వైఎస్ విగ్రహాన్ని మేయర్ ఎంట్రెన్స్ ముఖద్వారం ముందు ప్రతిష్టిస్తే ఎలాంటి పరిణామాలెదురవుతాయోన్నదే అధికారుల భయం. వైఎస్ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టించాలన్న అంశంపై పాలక మండలి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే గానీ, ఈ మూడు విగ్రహాల చిక్కుముడి వీడేటట్లు లేదు. పాలక మండలి, అధికార యంత్రాంగం, ఉద్యోగ సంఘాలు పరస్పరం సమన్వయంతో ఈ సమస్యకు పరిష్కారాన్ని సమకూర్చాలని కోరుతున్నారు.