హైదరాబాద్

శ్రీ సప్తముఖ కాళసర్ప మహా గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్: దేశ విదేశాల్లో ప్రసిద్ధిగాంచిన వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, విగ్రహ శిల్పి రాజేంద్రన్ వెల్లడించారు. ఈ విగ్రహంలో ప్రతిదీ ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడంవల్ల ఉత్సవాలు చేసేవారికి, మొక్కే భక్తులకు మేలు జరుగుతుందని సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌శర్మ తెలిపారు. ఆయన సూచన మేరకు ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని విగ్రహం ప్రత్యేకతను వివరించారు. శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి విగ్రహం ఎత్తు 57 అడుగులు, వెడల్పు 24 అడుగులుగా వుంటుందని నిర్వాహకులు తెలిపారు.