హైదరాబాద్

మళ్లీ వచ్చారు.. పరిష్కరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కార కోసం అంటూ పాలకులు, అధికారులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సమస్యలకు పరిష్కారం మాట దేవుడెరుగు గానీ, తమ ప్రచారానికే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయ నాయకులైతే రాజకీయంగా తమకు ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందనే అంశాలనే ప్రాధాన్యతగా తీసుకుని వాటి గురించే మాట్లాడుతుంటారు. కానీ, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు భిన్నంగా వ్యవహారిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ‘మన నగరం’ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నగర శివార్లలోని మన్సూరాబాద్, నాగోల్ ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు మంత్రి దృష్టికి వచ్చాయి. తమతో పరిష్కారం సాధ్యంకాని అంశాలను కూడా అక్కడికక్కడే తేల్చి చెప్పారు. అంతకుముందు కూడా వివిధ మంత్రుల శాఖలు, ఉన్నతాధికారులతో ఆ ప్రాంతానికి వచ్చిన మంత్రి దృష్టికి ఆ భూ వివాదాలు ‘మన నగరం’ కార్యక్రమంలో రెండో సారి దృష్టి రావటంతో, భూ వివాదాల పరిష్కారం కోసం సోమవారం ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఎల్‌బీనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, ప్రజల నుంచి స్వీకరించిన సమస్యల పరిష్కారం తీరును సమీక్షించారు. ఈ భూ వివాదాలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్థానిక జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది మొత్తాన్ని కూడా వెంటే తీసుకుని వచ్చారు. ఈ వివాదాల్లో అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్, ఎఫ్‌టీఎల్ సంబంధిత వివాదాలు అధికంగా ఉన్నాయని, వీటిలో పాలన సంబంధిత అంశాలను పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అసైన్డ్ భూముల వివాదాలపై త్వరలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని, స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల్లో పదేళ్లుగా ఉన్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా నో ఆబ్జక్షన్ సర్ట్ఫికెట్లు జారీ చేసేందుకు చర్యలు చేపడుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. చెరువుల ఎఫ్‌టీఎల్, కన్జర్వేషన్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున, తాము జోక్యం చేసుకోబోమని కూడా మంత్రి తేల్చి చెప్పటంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదాలపై ఒక పరిష్కారం సమకూర్చినట్టయింది. ఈ కేవలం ప్రజల సమస్యలను స్వీకరించటమే కాకుండా, వాటికి ఏ మేరకు పరిష్కారం సమకూరిందనే విషయాన్ని ప్రతి మంత్రి, ప్రతి విభాగాధిపతి, అధికారులు నిర్వహిస్తే సర్కార్ కార్యాలయాల చుట్టు ప్రజలు తిరిగే దుస్థితి ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసంతృప్తితో వెనుదిరిగిన బాధితులు
దిల్‌సుఖ్‌నగర్: పెండింగ్‌లో ఉన్న జఠిల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం తూర్పు జోనల్ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్ తదితరల శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం ముహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను లోపలికి అనుమతించ లేదు. తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని నేరుగా మంత్రికి వివరించడానికి చాలా మంది వచ్చారు. కానీ, సమయం ఇవ్వకుండా, గోడు వినిపించుకోకుండా మంత్రి వెళ్లిపోయారు. బాధితులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఓ మహిళ తన సమస్యను వివరించేందుకు ప్రయత్నించగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పాలని కనె్నర్ర చేశారు. ఆ మహిళ అసంతృప్తి చెందింది. సమావేశం అనంతరం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను గుర్తించి వాటిలో ప్రజలకు అవరమైన వౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్, కార్పొరేటర్లు సామ తిరుమల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామ రమణా రెడ్డి, భవానీ ప్రవీణ్ కుమార్, జిన్నారం విఠల్ రెడ్డి పాల్గొన్నారు.