హైదరాబాద్

పక్కాగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: జలమండలి మొత్తం కార్యాలయాలను ప్లాస్టిక్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ అమలుపై విధించిన నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఆదేశించారు. సోమవారం ఆయన బోర్డు ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన డైరెక్టర్లతో సమీక్షా సమావేశ్నా నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులతో పాటు వాటర్ బాటిళ్లను సైతం వినియోగించకూడదని అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి సర్కిల్, డివిజన్, మేనేజర్ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే కార్యాలయాల్లో తాగేందుకు మినరల్ వాటర్ కాకుండా వాటర్ బోర్డు సరఫరా చేస్తున్న నీటినే అందుబాటులో ఉంచాలన్నారు. పాతబస్తీలో చేపట్టనున్న మంచినీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టుపై సమీక్షిస్తూ వర్షాకాల నేపథ్యంలో వర్షాకాల ప్రణాళిక అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. వర్షాకాలంలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యాన్‌హోళ్లపై గ్రిల్స్‌ను ఏర్పిటు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డీజీఎంలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు నిర్వహించి, ఈ గ్రిల్స్ ఏర్పాటు పనులను సమీక్షించాలన్నారు. వర్షాకాలం కారణంగా రోడ్డు పనురుద్దరణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు తవ్వకాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులు నిరాకరించిందని దీంతో నూతన నల్లా కనెక్షన్లను మంజూరీని నిలిపివేయాలని ఆదేశించారు. కూకట్‌పల్లి నాలాపై నూతనంగా నిర్మించనున్న మినీ ఎస్టీపీల నిర్మాణం, టెండర్ల ప్రక్రియపై సమీక్షిస్తూ, నగరంలో ఎక్కడ కూడా కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఒక వేళ కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు నిర్దారణ అయితే పైప్‌లైన్ మార్పు పనులకు అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ పీఎస్. సూర్యనారాయణ, ప్రాజెక్టు-1 డైరెక్టర్ ఎం. ఎల్లాస్వామి, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబు, ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్లు అజ్మీరాకృష్ణ, పి.రవి, విజయకుమార్‌రెడ్డి, వాసుదేవ తదితరులు పాల్గొన్నారు.