హైదరాబాద్

క్రమబద్ధీకరణ జీఓలకు గడువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక మండలి పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మననగరం కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చిన భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం గడ్డి అన్నారం జీహెచ్ ఎంసీ జోనల్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి అధికారులతో సమీక్షించిన ఆయన దీర్ఘకాలిక వివాదాస్పద భూములను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఎఫ్‌టీఎల్, కనె్జర్వేషన్ జోన్ పరిధిలోని భూములు మినహా మిగిలిన అసైన్డ్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించిన స్థలాలను క్రమబద్ధీకరించేందుకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 58, 59, 92 జీఓల గడువులను పొడిగించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు ధరఖాస్తు చేసుకోని అక్రమణదారులకు మరో అవకాశం కల్పించడంతో పాటు అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి స్థలాల క్రమబద్ధీకరణపై వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. దీని కోసం 15 రోజుల్లోగా ప్రభుత్వం భూములు, అసైన్డ్ భూములు, మిగులు భూముల్లో అక్రమంగా నిర్మించిన నివాసాల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించి తమకు అందజేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలాల్లో ఎవరైనా నూతనంగా నిర్మాణాలు చేపడితే వెంటనే వాటిని తొలగించాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో నాగోలులోని సర్వేనెంబర్ 96, 101లోని సుమారు 83 ఎకరాల స్థలంలో ప్రభుత్వ నిబందనలకు విరుద్ధంగా చేపట్టిన సుమారు 949 ఇళ్ల నిర్మాణదారులకు సదరు స్థలాలను క్రమబద్ధీకరించే అవకాశం లభిస్తోంది. అలాగే ఏడెకరాల స్థలంలో నిర్మించుకున్న సుమారు 550 మంది గుడిసె వాసులకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫత్తులగూడ సర్వేనెంబర్ 58లో అక్రమంగా ఆక్రమించుకొని నివాసం ఉంటున్న సుమారు 740 మంది నిరుపేదలకు జీఓ 58 ద్వారా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సర్వేనెంబర్ 87లోని 23 ఎకరాలు, 88లోని 81 ఎకరాల్లో నిర్మించుకున్న నివాసాల వరకు స్థలాల క్రమబద్ధీకరణ చేసే అవకాశం లభిస్తోంది. దీర్ఘకాలికంగా 2007 నుంచి రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసిన హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్, సరూర్‌నగర్ మండలంలోని పలు ప్రాంతాల్లోన్ని స్థలాలకు సంబంధించి వివాదాలు సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో నిర్మించుకున్న నివాసాల వివరాలను క్లుప్తంగా వివరించాలని ఆర్డీఓలను మంత్రి ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు అవగాహన లేని కారణంగా పైన వివరించిన క్రమబద్ధీకరణ ఉత్తర్వుల మేరకు ధరఖాస్తు చేసుకోని వారికి మరోసారి అవకాశం లభించనుంది.